Breaking News

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా? లిమిట్‌ దాటితే బాదుడే!

Published on Thu, 06/13/2024 - 13:32

క్యాష్ విత్‌డ్రాపై కస్టమర్లు చెల్లించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)లను సంప్రదించారు. ఇప్పటికే ఉన్న ఛార్జీలకు మరో రెండు రూపాయలు పెంచాలని కోరింది.

వ్యాపారం కోసం మరిన్ని నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) ఇంటర్‌చేంజ్ ఫీజును ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 23కి పెంచాలని పేర్కొంది. రెండు సంవత్సరాల క్రితం ఇంటర్‌చేంజ్ రేటును చివరిసారిగా పెంచినట్లు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ వెల్లడించారు.

2021లో ఏటీఎం లావాదేవీలపై ఇంటర్‌చేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కి పెంచారు. ప్రస్తుతం ఈ ఫీజు రూ. 21గా ఉంది. ఏటీఎం ఆపరేటర్ల కోరిక మేరకు ఆర్‌బీఐ మరో రెండు రూపాయలు పెంచడానికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తే.. అది రూ. 23లకు చేరుతుంది.

ఏటీఎం చార్జెస్ అనేవి లిమిట్ దాటితే వర్తిస్తాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఏటీఎం నుంచి నెలకు ఐదు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి ఆరు ప్రధాన నగరాల్లో బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఈ లిమిట్ దాటిన తరువాత ఈ చార్జెస్ వర్తిస్తాయి.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)