Breaking News

ఏటీఎఫ్‌ ధర 5 శాతం తగ్గింపు

Published on Sat, 12/02/2023 - 06:18

న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధర 4.6 శాతం తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో ఏటీఎఫ్‌ రేటు కిలోలీటరుకు రూ. 5,189 తగ్గి రూ. 1,06,156కి దిగి వచ్చింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌ (19 కేజీల) ధర రూ. 21 తగ్గి రూ. 1,749కి పరిమితమైంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్‌ ధర యధాప్రకారం రూ. 903 (14.2 కేజీల సిలిండర్‌)గానే కొనసాగనుంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్‌ సంస్థలు ఈ మేరకు సవరించిన ధరలను శుక్రవారం ప్రకటించాయి. ఏటీఎఫ్‌ను తగ్గించడం నెలరోజుల్లో ఇది రెండోసారి. నవంబర్‌ 1న దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ. 6,854) తగ్గింది.

అంతకు ముందు జులై 1 నుంచి నాలుగు నెలల  వ్యవధిలో రేటు రూ. 29,391 మేర పెరిగింది. తాజాగా రెండు విడతల తగ్గింపుతో అందులో సుమారు మూడో వంతు భారం తగ్గినట్లయింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. దీన్ని తగ్గించడంతో ఎయిర్‌లైన్స్‌పై భారమూ తగ్గుతుంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్‌ రేట్లను సవరిస్తాయి. ఇందుకోసం క్రితం నెల అంతర్జాతీయంగా ఉన్న సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్‌ రేట్లను రోజువారీ సవరించాల్సి ఉన్నప్పటికీ 2022 ఏప్రిల్‌ 6 నుంచి రికార్డు స్థాయిలో 21 నెలలుగా మార్చడం లేదు. మే 22న కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడం ఇందుకు మినహాయింపు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)