Breaking News

రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం

Published on Wed, 12/24/2025 - 18:52

హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘హరియాణా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (సవరణ) బిల్లు, 2025’కు ఆమోదం లభించింది. 1958 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రోజువారీ పని గంటలను పెంచడంతో పాటు పలు సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

బిల్లులోని ముఖ్యాంశాలు

  • ప్రస్తుతమున్న 9 గంటల పని పరిమితిని 10 గంటలకు పెంచారు. ఇందులో విశ్రాంతి సమయం కూడా కలిసి ఉంటుంది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • త్రైమాసికానికి ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. వ్యాపార గరిష్ట డిమాండ్ సమయాల్లో సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.

  • విరామం లేకుండా చేసే నిరంతర పని సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు.

  • 20 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వ్యాపార సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది.

వ్యాపార సౌలభ్యమా? బానిసత్వమా?

ఈ బిల్లుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘చిన్న సంస్థలపై భారాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 10 గంటల పని విధానం ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సుర్జేవాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రోజుకు 10 గంటలు, దానికి తోడు 2 గంటల ఓవర్ టైమ్ కలిపితే ఒక కార్మికుడు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. ఇలా అయితే ఒక కార్మికుడు తన కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: మీ స్మార్ట్‌వాచ్‌.. బీమా ప్రీమియం​ డిసైడ్‌ చేస్తుందా?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)