Breaking News

నిజమవుతున్న రతన్‌ టాటా కల.. ఇక చైనా అవసరం లేనట్లే!

Published on Mon, 08/05/2024 - 10:55

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన తరువాత చాలా దేశాలు సెమీకండక్టర్ చిప్ కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' స్వదేశీ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు నిజం కాబోతోంది.

భారతదేశంలో సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేస్తే.. మన దేశం చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. రతన్ టాటా అనుకున్న విధంగానే చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్‌లో ప్లాంట్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమక్షంలో జరిగింది.

అస్సాంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ. 27 వేలకోట్లు ఖర్చవుతుందని సమాచారం. నిర్మాణం పూర్తయిన తరువాత సుమారు 27000 కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. సెమీకండక్టర్ తయారీలో అగ్రగామిగా ఉన్న చైనా మీద.. భారత్ ఆధారపడటం తగ్గుతుంది. దీనికోసం టాటా కంపెనీ కోట్లాది సెమీకండక్టర్లను తయారు చేయడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో భారత్ సెమికండక్టర్ చిప్ ఎగుమతిదారుగా కూడా నిలిచే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: తులం బంగారం కేవలం రూ.63.. మరి ఇప్పుడో..!

టాటా సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ 2025 నాటికి సిద్ధమవుతుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన ఐదు నెలల వ్యవధిలోనే ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)