Breaking News

కేంద్రంపై విమర్శలు.. రాజకీయాల్లోకి అష్నీర్‌ గ్రోవర్‌?

Published on Wed, 07/12/2023 - 14:03

ఫిన్‌టెక్‌ దిగ్గజం భారత్‌ పే మాజీ ఫౌండర్‌ అష్నీర్‌ గ్రోవర్‌ రాజకీయాల్లోకి రానున్నారా? లేదంటే రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.

కేంద్రం ఆన్‌లైన్‌ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీని విధించింది. ఈ నిర్ణయాన్ని అష్నీర్‌ గ్రోవర్‌ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో దేశంలో గేమింగ్‌ ఇండస్ట్రీ కుప్పకూలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ వాణిని వినిపించేందుకు టెక్నాలజీ స్టార్టప్‌ ఫౌండర్లు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

గ్రోవర్‌ మాత్రమే కాదు ఇండియా గేమింగ్ ఫెడరేషన్‌తో పాటు ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS), ఆన్‌లైన్ స్కిల్ గేమ్‌లపై జీఎస్టీని 18 శాతం నుండి 28 శాతానికి పెంచడంపై కౌన్సిల్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. 

నేనే రాజకీయ నాయకుడిని అయితే
అష్నీర్‌ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం వసూలు చేసే టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధానాన్ని వ్యతిరేకించారు. అందులో లోపాల్ని సవరించాలని అన్నారు. అదే సమయంలో తాను రాజకీయ నాయకుడిని అయితే, దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్‌ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. తాజాగా, మరోమారు పాలిటిక్స్‌పై హాట్‌ కామెంట్స్‌ చేయడంపై అష్నీర్‌ గ్రోవర్‌ పాలిటిక్స్‌లోకి అడుగు పెడతారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్‌ గ్రోవర్‌, అతని భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)