Breaking News

కళను హరిస్తున్న ఏఐ.. ఆర్టిస్టులు ఏం చేశారంటే..

Published on Thu, 04/04/2024 - 15:11

ఒకప్పుడు సైన్స్‌ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. 

తాజాగా ఓపెన్ఏఐ త‌న ఎల్ఎల్ఎంల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు అనుమ‌తి లేకుండానే త‌మ బుక్స్‌ను వాడుతోంద‌ని ఆరోపిస్తూ కొద్దినెల‌ల కింద‌ట వంద‌లాది ర‌చ‌యిత‌లు టెక్ కంపెనీకి వ్య‌తిరేకంగా కోర్టును ఆశ్ర‌యించారు. ఇక ఇదే త‌ర‌హాలో జొనాస్ బ్ర‌ద‌ర్స్ స‌హా 200 మందికిపైగా మ్యూజీషియ‌న్లు ఏఐకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. త‌మ హ‌క్కుల‌ను ఉల్లంఘించే ప‌ద్ధ‌తులను నిలిపివేయాల‌ని కోరుతూ ఏఐ కంపెనీల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. తమ కళను హరించకూడదంటూ అందులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’

ఆర్టిస్ట్స్ రైట్స్ అల‌య‌న్స్ ఆధ్వ‌ర్యంలో రాసిన ఈ లేఖ‌పై జొనాస్ సోద‌రులు, బిల్లీ ఇలిష్‌, క్యాటీ పెర్రీ, స్మోకీ రాబిన్స‌న్ వంటి ప్ర‌ముఖ ఆర్టిస్ట్‌లు సంత‌కాలు చేశారు. మ్యూజిక్ ప‌రిశ్ర‌మ‌లో ఏఐ వినియోగంతో త‌లెత్తే దుష్ప్ర‌భావాల‌పై ఈ లేఖ‌లో వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏఐ దుర్వినియోగంతో సృజ‌నాత్మ‌క‌త దెబ్బ‌తింటుంద‌ని, ఆర్టిస్టులు, హ‌క్కుదారుల ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని ఏఐ డెవ‌ల‌ప‌ర్లు, టెక్నాల‌జీ కంపెనీలు, డిజిట‌ల్ వేదిక‌ల‌కు వారు విజ్ఞ‌ప్తి చేశారు. 

#

Tags : 1

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)