Breaking News

ఏఐతో రెండేళ్లలోనే అందుబాటులోకి ఔషధాలు 

Published on Wed, 11/18/2026 - 05:15

న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ)తో ఔషధాలను అభివృద్ధి చేసే ప్రక్రియకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా చెప్పారు. ప్రస్తుతం 5–7 ఏళ్లు పడుతుండగా, ఏఐని ఉపయోగించడం వల్ల కేవలం ఏడాది–రెండేళ్ల వ్యవధిలోనే ఔషధాలు ప్రయోగశాలల నుంచి పేషంట్లకు అందుబాటులోకి రాగలవని ఆమె తెలిపారు. 

దీనితో పేషంట్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన ఔషధాలను కచ్చితత్వంతో రూపొందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. బెంగళూరు టెక్‌ సదస్సు 2026 తొలి రోజున లైఫ్‌ సైన్సెస్‌లో ఏఐ పాత్ర గురించి ఆమె వివరించారు. ‘ఔషధాలను అభివృద్ధి చేయడమనేది కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాదు. వాటిని సరైన పేషంట్లను ఎంచుకుని, క్లినికల్‌ ట్రయల్స్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించాలి. 

ప్రస్తుతం ఒక మాలిక్యూల్‌ను ప్రయోగశాల నుంచి పేషంట్ల దగ్గరకు తీసుకెళ్లాలంటే దాదాపు ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు సమయం పట్టేస్తోంది. ఏఐతో దాన్ని మనం ఏడాది లేదా రెండేళ్లకు తగ్గించగలమా? అలా జరిగితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు‘ అని మజుందార్‌ షా తెలిపారు. ఔషధాలను కనుగొనడం, అభివృద్ధి చేయడం వేగవంతమవుతున్న నేపథ్యంలో నియంత్రణ నిబంధనలు కూడా దానికి తగ్గట్లుగా వేగవంతం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఏఐతో జినోమిక్స్, న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ మొదలైన వాటిని మేళవించడం ద్వారా కొత్త తరం ఔషధాలను, క్యాన్సర్‌ కణాల్లాంటి వాటిని ముందుగానే గుర్తించగలిగేలా వైద్యపరీక్షలను రూపొందించవచ్చని షా వివరించారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే సదస్సులో వివిధ పరిశ్రమల నుంచి అంతర్జాతీయ ఎంట్రప్రెన్యూర్లు, ఆవిష్కర్తలు, ఇన్వెస్టర్లు తదితరులు పాల్గొంటున్నారు.  

ఇంజినీర్లకు సరికొత్తగా శిక్షణనివ్వాలి: క్రిస్‌ గోపాలకృష్ణన్‌ ప్రోగ్రామింగ్‌ను ఏఐ ఆటోమేట్‌ చేస్తోందని, అయితే ఈ టెక్నాలజీని ఇంకా పూర్తిగా విశ్వసించలేమని ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు ఎస్‌ గోపాలకృష్ణన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కో డింగ్‌కి పరిమితం కాకుండా ఏఐ రాసిన కోడ్‌ను సమీక్షించి, సరి్టఫై చేసే విధంగా వారికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. 

ఏఐతో ప్రోడక్టులు, సరీ్వసులను రూపొందించేందుకు అనేకానేక కొత్త సంస్థలకు అవకాశాలు ఏర్పడినప్పటికీ రాబోయే మరికొంతకాలం పెద్ద కంపెనీలకు సంబంధించి ఐటీ సరీ్వసులు, ఔట్‌సోర్సింగ్‌ యథాప్రకారం కొనసాగవచ్చని టెక్‌ సమిట్‌లో పా ల్గొన్న సందర్భంగా వివరించారు. ‘ఏఐ వల్ల మిగతావాటిపై ప్రభావం పడుతుందనుకుంటే చిత్రంగా ప్రోగ్రామింగ్‌పైనే ముందుగా ప్రభావం చూపింది. అయితే, ఏఐని పూర్తిగా విశ్వసించలేము. అది తప్పులు చేయొచ్చు. 

కొన్ని సార్లు ఏదైనా కోడ్‌ లో కావాలనే బగ్‌ను చేర్చవచ్చు. ప్రస్తుతం ప్రో గ్రామర్లు ఏఐ కోడ్‌ను రివ్యూ చేయడం, సరి్టఫై చేయ డం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది చేయాలంటే వారికి కోడ్‌పై అపారమైన పట్టు ఉండాలి. దీనికి మన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మళ్లీ సరికొత్తగా శిక్షణ పొందాల్సి ఉంటుంది‘ అని గోపాలకృష్ణన్‌ పే ర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్‌ విషయానికొస్తే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లాంటి దిగ్గజాల అనుభవాన్ని వినియోగించుకోవాలని పరిశ్రమ కోరుకుంటుంది కాబట్టి.. ఔట్‌సోర్సింగ్‌ రాబోయే రోజుల్లో నూ కొనసాగవచ్చని వివరించారు. కన్సల్టింగ్, ఐటీ సరీ్వసుల కంపెనీలు కూడా యథాప్రకారంగానే ఉంటాయని పేర్కొన్నారు.

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)