Breaking News

ఐటీ కంపెనీల స్టార్టప్‌ వేట!

Published on Wed, 12/04/2024 - 04:19

ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా ఎనలిటిక్స్, క్లౌడ్‌ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం అంతకంతకూ జోరందుకుంటోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందున్న ఐటీ కంపెనీలు.. ఆయా విభాగాల్లో తమ సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం కోసం స్టార్టప్‌ కంపెనీలను బుట్టలో వేసుకుంటున్నాయి. దేశంలో సెమీకండక్టర్ల (చిప్‌) తయారీ ఊపందుకోవడంతో చిప్‌ డిజైన్, స్పేస్‌ టెక్నాలజీ పైగా దృష్టి సారిస్తున్నాయి. 

ఈ వేటలో యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఐబీఎంతో వంటి దిగ్గజాలతో పాటు మధ్య తరహా ఐటీ సంస్థలైన పర్సిస్టెంట్, సైయంట్, గ్లోబల్‌ లాజిక్‌ కూడా ముందు వరుసలో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో ప్రావీణ్యం కలిగిన చిన్న, స్టార్టప్‌లను దక్కించుకోవడం వల్ల ఐటీ కంపెనీల ఆదాయం, వేల్యుయేషన్లు కూడా పుంజుకోవడానికి వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

జోరుగా.. హుషారుగా... 
గత నెలలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ యాజ్‌–ఎ–సర్విస్‌ (సాస్‌) స్టార్టప్‌ ప్రెసింటోను ఐబీఎం కొనుగోలు చేసింది. ఇదే నెలలో హైదరాబాద్‌ ఐటీ ఇంజినీరింగ్‌ సర్విసుల సంస్థ సైయంట్‌ అమెరికాకు చెందిన భారతీయ స్టార్టప్‌ అజిమత్‌ ఏఐలో 27.3 % వాటాను చేజిక్కించుకుంది. ఇందుకోసం దాదాపు 7.25 మిలియన్‌ డాలర్లను వెచి్చంచింది. సెమీకండక్టర్‌ పరిశ్రమలో సైయంట్‌ సామర్థ్యాల విస్తరణకు ఈ కొనుగోలు దోహదం చేయనుంది.

ఇక మరో మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీ పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌... పుణేకు చెందిన డేటా ప్రైవసీ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఆర్కాను రూ.14.4 కోట్లకు దక్కించుకోనున్నట్లు ప్రకటించింది. టాప్‌–2 ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సైతం స్పేస్‌ టెక్‌ స్టార్టప్‌ గెలాక్స్‌ఐలో రూ.17 కోట్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకొచి్చంది. కంపెనీలో ఇన్నోవేషన్‌ ఫండ్‌లో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది. తద్వారా ఆ స్టార్టప్‌లో 20 శాతం ఇన్ఫోసిస్‌కు చిక్కనుంది. మరో అగ్రగామి యాక్సెంచర్‌ ఈ ఏడాది జూలైలో చిప్‌ డిజైన్‌ స్టార్టప్‌ ఎక్సెల్‌మ్యాక్స్‌ టెక్నాలజీస్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో ఇన్ఫోగెయిన్‌ కూడా యూఎస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌ ఇంపాక్టివ్‌ను కైవసం చేసుకుంది.     

బడా ఐటీ కంపెనీలు ఇప్పుడు స్టార్టప్‌ కంపెనీల వెంట పడుతున్నాయి. టెక్నాలజీ సామర్థ్యాలతో పాటు ఆదాయాలు, వేల్యుయేషన్లను పెంచుకోవడమే లక్ష్యంగా దేశీ స్టార్టప్‌ సంస్థల కొనుగోలుకు తెరతీశాయి. ఏఐ వంటి అధునాతన సాంకేతికతల్లో అంతరాన్ని పూడ్చుకోవడానికి కూడా ఈ వ్యూహం బాగానే పనిచేస్తోంది. మరోపక్క, నిధుల కటకటను ఎదుర్కొంటున్న స్టార్టప్‌లకు ఇది దన్నుగా నిలుస్తోంది.

తాజా కొనుగోళ్లు ఇలా...
⇒ యాక్సెంచర్‌ – ఎక్సెల్‌మ్యాక్స్‌ (చిప్‌ డిజైన్‌) 
⇒ ఇన్ఫోసిస్‌ – గెలాక్స్‌ఐ (స్పేస్‌ టెక్‌) 
⇒ ఐబీఎం – ప్రెసింటో (సాస్‌) 
⇒ జోరియంట్‌  – మ్యాపిల్‌ల్యాబ్స్‌ (క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌) 
⇒ సైయంట్‌ – అజిమత్‌ ఏఐ (సెమీకండక్టర్‌) 
⇒ పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ – ఆర్కా (డేటా ప్రైవసీ) 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)