Breaking News

ప్రముఖ మార్ట్‌లో 450 లీటర్ల కల్తీ నెయ్యి

Published on Fri, 06/21/2024 - 14:35

వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్‌లో భారీగా కల్తీ నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రోవేదిక్ నెయ్యి నాణ్యతపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో జైపూర్ లోని డీమార్ట్ స్టోర్ లో 450 లీటర్ల కల్తీ నెయ్యిని రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ విభాగం స్వాధీనం చేసుకుంది.

జైపూర్ లోని అన్ని దుకాణాలు, గోదాముల్లో ఉంచిన ప్రోవేదిక్ నెయ్యి, సరస్ నెయ్యి నిల్వలను నివేదించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని విక్రయించవద్దని డీమార్ట్ ఏరియా సేల్స్ మేనేజర్‌ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆదేశించినట్లు ఎన్‌డీటీవీ నివేదిక పేర్కొంది.

ప్రాథమిక విచారణలో మాలవీయ నగర్ లోని సూపర్ మార్కెట్ లో నిల్వ ఉంచిన సుమారు 450 లీటర్ల నెయ్యి కల్తీ అని తేలింది. సరస్ నెయ్యి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, అనలిస్ట్ నుంచి కల్తీ నాణ్యతను నిర్ధారించిన అధికారులు సుమారు 40 లీటర్ల నకిలీ సరస్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యిలో ఒకే బ్యాచ్ నంబర్, సిరీస్ ఉన్నట్లు గుర్తించారు. విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నకిలీ సరస్ నెయ్యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)