Breaking News

‘మా హార్డ్‌వేర్‌ సరఫరాదారులపై యాపిల్‌ ఒత్తిడి’

Published on Sat, 11/28/2026 - 17:17

గ్లోబల్‌ టెక్నాలజీ రంగంలో ఒకప్పుడు కీలక భాగస్వాములుగా నిలిచిన యాపిల్‌, ఓపెన్‌ఏఐ సంస్థల మధ్య వివాదం తీవ్ర న్యాయపోరుగా మారింది. ఐఫోన్‌ వ్యవస్థలో చాట్‌జీపీటీ సేవలను అనుసంధానించేందుకు 2024లో కలిసి పనిచేసిన ఈ దిగ్గజాలు.. ఇప్పుడు వాణిజ్య రహస్యాల దుర్వినియోగం, ఉద్యోగుల నియామక విధానాలు, పోటీని అడ్డుకునే ప్రయత్నాలపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇటీవల ఓపెన్‌ఏఐ ప్రతిదావా దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.

2026 జులై 10న కాలిఫోర్నియా నార్త్‌ డిస్ట్రిక్ట్‌ ఫెడరల్‌ కోర్టులో యాపిల్‌ తొలుత కేసు వేసింది. మాజీ ఉద్యోగులు టాంగ్‌ టాన్‌, చాంగ్‌ లియూ ద్వారా తమ హార్డ్‌వేర్‌ అభివృద్ధి, ఉత్పత్తుల రూపకల్పన, సాంకేతిక వివరాలు, సరఫరాదారుల సమాచారాన్ని ఓపెన్‌ఏఐ యూజర్‌ హార్డ్‌వేర్‌ కోసం పొందేందుకు యత్నించిందని యాపిల్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఓపెన్‌ఏఐ ఖండిస్తూ అవి నిరాధారమైనవని స్పష్టం చేసింది.

ఉద్యోగులను నిరోధించేలా నిబంధనలు

ప్రతిగా నవంబర్‌ 27న దాఖలు చేసిన దావాలో ఓపెన్‌ఏఐ కీలక ఆరోపణలు చేసింది. పోటీ సంస్థలకు వెళ్లకుండా ఉద్యోగులను నిరోధించేలా యాపిల్‌ నియామక విధానాలు ఉన్నాయని పేర్కొంది. సుమారు ఆరు నెలలు ఓపెన్‌ఏఐలో పనిచేసి తిరిగి యాపిల్‌లో చేరిన మాజీ ఉద్యోగి ద్వారా తమ కొత్త పరికరం, భవిష్యత్‌ హార్డ్‌వేర్‌ ప్రణాళికల సమాచారం యాపిల్‌కు చేరిందని ఆరోపించింది. అలాగే తమ హార్డ్‌వేర్‌ సరఫరాదారులపై యాపిల్‌ ఒత్తిడి తెచ్చి ఉత్పత్తి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించిందని పేర్కొంది.

అయితే, ఇరుపక్షాల ఆరోపణలను న్యాయస్థానం ఇంకా తుది తీర్పులో నిర్ధారించలేదు. 2026 అక్టోబర్‌ 13న న్యాయమూర్తి ఎడ్వర్డ్‌ జె. డావిలా అత్యవసర విచారణకు సంబంధించిన కొన్ని అంశాలకే అనుమతి ఇచ్చి, కొన్నింటిని తిరస్కరించారు. 2024 భాగస్వామ్యం నుంచి సొంత హార్డ్‌వేర్‌, వ్యూహాత్మక మార్పులు ఈ వివాదానికి దారితీశాయి. భవిష్యత్‌ ఏఐ పరికరాల మార్కెట్‌లో ఆధిపత్య పోరుకు ఈ కేసు అద్దం పడుతోంది. కోర్టు తదుపరి ఆదేశాలు, సాక్ష్యాధారాలతోనే వాస్తవాలు తేలనున్నాయి.

ఇదీ చదవండి: ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి!

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)