Breaking News

యాపిల్‌ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థ

Published on Tue, 06/25/2024 - 08:48

ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ మెటా తయారుచేసిన లామా ఏఐ చాట్‌బాట్‌ను యాపిల్‌ ఉత్పత్తుల్లో వినియోగిస్తారని వస్తున్న వార్తలపై యాపిల్‌ స్పష్టతనిచ్చింది. రెండు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదని యాపిల్‌ వర్గాలు తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.

జనరేటివ్‌ఏఐకు ఆదరణ పెరుగుతుండడంతో యాపిల్‌ ఉత్పత్తుల్లోనూ ఈ టెక్నాలజీను వినియోగించాలని సంస్థ యోచిస్తోంది. దాంతో గతంలో పలు కంపెనీలతో చర్చలు జరిపింది. అందులో భాగంగానే మార్చిలో మెటాతోనూ చర్చించింది. అయితే గోప్యతాపరమైన కారణాల వల్ల ఈ భాగస్వామ్యం కుదరలేదని చెప్పింది. ఇటీవల యాపిల్‌ ప్రొడక్ట్‌ల్లో మెటా కంపెనీకు చెందిన లామా చాట్‌బాట్‌ను వినియోగించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో బ్లూమ్‌బర్గ్‌ వేదికగా యాపిల్‌ వర్గాలు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాయి. అలాంటి చర్చలు ఏవీ జరగడం లేదని స్పష్టం చేశాయి.

ఇదీ చదవండి: రైలు టికెట్‌ బుక్‌ చేస్తే జైలు శిక్ష, 10వేలు జరిమానా..!

ఇటీవల యాపిల్‌ నిర్వహించిన వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్‌ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్‌ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్‌ సంస్థ ‘యాపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్‌ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఈ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. ఈ ఏడాది చివరకు విడుదలయ్యే కొత్త యాపిల్‌ ఓఎస్‌లో ఈ ఫీచర్‌ను అందించనున్నట్లు చెప్పింది.

#

Tags : 1

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)