Breaking News

ఐఫోన్‌ 15 కీలక అప్‌డేట్‌: ఆ రంగులకు సెలవు!

Published on Fri, 08/25/2023 - 10:52

ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్‌ ( Apple ) ఐఫోన్‌ 15 ( iPhone 15) సిరీస్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ గురించి తెలిసింది. ఐఫోన్‌ 15 లాంచ్ డేట్‌పై యాపిల్‌ పెదవి విప్పలేదు. కానీ సెప్టెంబర్ 12 లేదా 13 తేదీల్లో ఐఫోన్ 15 విడుదలవుతుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 15 రంగులకు సంబంధించి తాజా రూమర్‌ ఒకటి విస్తృతంగా ప్రచారమవుతోంది.

ఐఫోన్ల, ఇతర యాపిల్‌ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే 9to5Mac అనే వెబ్‌సైట్‌ నివేదిక ప్రకారం.. ఐఫోన్‌ 15 ప్రో ( iPhone 15 Pro )  కోసం యాపిల్‌ కంపెనీ రెండు కొత్త కలర్‌ ఆప్షన్‌లను పరిచయం చేయాలని యోచిస్తోంది. గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లను నిలిపివేసి కొత్తగా గ్రే, బ్లూ కలర్స్‌ను తీసుకురానుంది.

గోల్డ్, పర్పుల్ కలర్స్‌ అవుట్‌!
ఐఫోన్లలో ముందు నుంచి వస్తున్న గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లను ఐఫోన్ 15 ప్రో మోడల్‌తో  నిలిపేస్తున్నట్లు చెబుతున్నారు. 2018లో ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ మోడల్‌ నుంచి గోల్డ్ కలర్ ఆప్షన్‌ను యాపిల్‌ కొనసాగిస్తోంది. నిజానికి ఐఫోన్‌ 6 మోడల్‌ నుంచే గోల్డ్‌ కలర్‌ ఏదో ఒక రూపంలో ఉంటూ వస్తోంది. ఇక పర్పుల్ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌తో పరిచయమైంది. 

సెప్టెంబరులో విడుదల కానున్న ఐఫోన్‌ 15 ప్రో ( iPhone 15 Pro ) కొత్త ఏ17 బయోనిక్ చిప్, 48 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా సిస్టమ్, పిల్-ఆకారపు కటౌట్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుందని పుకారు ఉంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌తో మొదటిసారిగా కలర్-కోఆర్డినేటెడ్ ఛార్జింగ్ కేబుల్‌లను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి