Breaking News

హైద‌రాబాద్‌లో యాపిల్‌ విస్తరణ... మరింత స్థలం లీజు

Published on Wed, 09/03/2025 - 18:36

సాక్షి, హైద‌రాబాద్‌: ప్రముఖ గ్లోబల్‌ సంస్థ యాపిల్‌ హైదరాబాద్‌ నగరంలో తన ఉనికిని, సేవలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా నగరంలోని ఐటీ పార్క్‌ వేవ్‌రాక్‌లో నూతనంగా 64,125 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ విస్తరణతో సంస్థ మొత్తంగా 5 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.

అయితే వేవ్‌రాక్‌ టవర్‌లో యాపిల్‌ 64,125 చదరపు అడుగుల అదనపు కార్యాలయ స్థలానికి రూ.80.15 లక్షల నెలవారీ అద్దె చెల్లించేలా ఐదేళ్లకు లీజ్‌కు తీసుకున్నట్లు సమాచారం. ఇందుకుగాను చదరపు అడుగుకు రూ.125 చొప్పున చెల్లించనుంది. హైదరాబాద్‌లోని టీఎస్‌ఐ బిజినెస్‌ పార్క్స్‌ లిమిటెడ్‌ ద్వారా ప్రాజెక్ట్‌లో ఉన్న యాపిల్‌ ప్రస్తుత కార్యాలయాలను విస్తరించింది. ప్రాప్‌స్టాక్‌ ప్రకారం., యాపిల్‌ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌లో అనేక కార్యాలయ స్థలాలను మల్టీ లీజ్‌లో భాగంగా మొత్తం 5 లక్షల చదరపు అడుగుల తీసుకుంది.

అద్దె ప్రారంభ తేదీ నుండి లీజుకు మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది . ఈ సమయంలో, ఒప్పందంలో పేర్కొన్న నిర్దిష్ట షరతుల కింద తప్ప, ఏ పక్షమూ లీజును రద్దు చేయలేరు. 2016 మేలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ అధికారికంగా హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించారు. జియోస్పేషియల్ టెక్నాలజీ, డేటా మోడలింగ్‌లో ప్రత్యేకత కలిగిన యాపిల్ మ్యాప్స్‌కు ఇది కీలకమైన అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుంది.

ఇదీ చదవండి: ఒక్కో కంపెనీ నెలకు ఎన్ని కోట్లు కడుతున్నాయో తెలుసా?


 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు