ఆంథ్రోపిక్‌ మరో సంచలనం.. రూ.90 వేల కోట్లు ఆవిరి!

Published on Sat, 02/21/2026 - 17:40

అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్‌ (Anthropic) మరోసారి మార్కెట్లలో సంచలనం సృష్టించింది. సంస్థ తన ఏఐ ప్లాట్‌ఫామ్ క్లాడ్‌ (Claude)లో కొత్తగా ప్రవేశపెట్టిన “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” ఫీచర్ ప్రభావంతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో భారీ కలకలం రేగింది. ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రముఖ సైబర్ భద్రతా సంస్థల షేర్లు 5% నుంచి 9% వరకు క్షీణించగా, మార్కెట్ విలువలో దాదాపు 10 బిలియన్‌ డాలర్లు (రూ.90 వేల కోట్ల వరకు) ఆవిరైనట్లు అంచనాలు సూచిస్తున్నాయి.

ఏమిటీ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ?
“క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” అనేది క్లాడ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు, వాటికి లక్ష్యిత పరిష్కారాలను సూచిస్తుంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు ఇది సహాయపడుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్‌ను విశ్లేషించి, బలహీనతలను గుర్తించి, మానవ సమీక్ష కోసం ప్యాచ్‌లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఏ స్టాక్స్ దెబ్బతిన్నాయంటే..
ఆంథ్రోపిక్‌​ ప్రకటన తర్వాత ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో గణనీయమైన అమ్మకపు ఒత్తిడి కనిపించింది. క్రౌడ్‌స్ట్రయిక్‌ (CrowdStrike) షేర్లు సుమారు 8% పడిపోయాయి. ఓక్టా స్టాక్‌ 9% పైగా క్షీణించింది. క్లౌడ్‌ఫ్లేర్‌ (Cloudflare) 7–8% మధ్య తగ్గింది. జెడ్‌స్కేలర్‌ గణనీయమైన నష్టాలను నమోదు చేసింది. అలాగే గిట్‌ల్యాబ్‌, జేఫ్రాడ్‌ షేర్ల కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ఇక సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ట్రాక్ చేసే గ్లోబల్‌ ఎక్స్‌ సైబర్‌సెక్యూరిటీ ఈటీఎఫ్‌ (Global X Cybersecurity ETF) కూడా దాదాపు 5% పడిపోయి, 2023 నవంబర్ తర్వాతి కనిష్ట స్థాయికి చేరింది.

మార్కెట్ ఎందుకు షేక్‌ అయిందంటే..
సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్‌ ప్రవేశపెట్టిన ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ద్వారా సాంప్రదాయ భద్రతా సాధనాలకు సవాలు విసిరినట్టైంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వర్క్‌ఫ్లోలోనే భద్రతా తనిఖీలు ఆటోమేటిక్ కావడం మార్కెట్ ఆందోళనకు కారణమైంది.

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)