Breaking News

పేటీఎమ్‌లో విజయ్‌కు అదనపు వాటా

Published on Fri, 08/18/2023 - 04:10

న్యూఢిల్లీ: పేటీఎమ్‌ బ్రాండ్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మకు అదనపు వాటా లభించింది. చైనీస్‌ ఈకామర్స్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ సంస్థ యాంట్‌ఫిన్‌ విజయ్‌కు పేటీఎమ్‌లోగల 10.3 శాతం వాటాను బదిలీ చేసింది. అయితే ఈ వాటాకు సంబంధించిన ఆరి్థక హక్కులు(ఎకనమిక్‌ రైట్స్‌) యాంట్‌ఫిన్‌వద్దనే కొనసాగనున్నాయి.

కంపెనీ వాటాదారుల్లో ఒకటైన యాంట్‌ఫిన్‌(నెదర్లాండ్స్‌) హోల్డింగ్‌ బీవీ సెబీ టేకోవర్‌ నిబంధనల ప్రకారం 6,53,35,101 షేర్లను బదిలీ చేసినట్లు పేటీఎమ్‌ పేర్కొంది. దీంతో పేటీఎమ్‌లో యాంట్‌ఫిన్‌ వాటా 23.79 శాతం నుంచి 13.49 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ఇదే సమయంలో విజయ్‌ వాటా 19.55 శాతానికి
బలపడినట్లు వెల్లడించింది. వెరసి పేటీఎమ్‌లో విజయ్‌ అతిపెద్ద వాటాదారుగా నిలిచినట్లు పేర్కొంది. వాటా బదిలీకిగాను యాంట్‌ఫిన్‌.. ఆప్షనల్లీ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఓసీడీలు)ను పొందనుంది. ఈ డీల్‌లో ఎలాంటి నగదు లావాదేవీలు జరగకపోగా.. షేరుకి రూ. 795 ధరలో వాటా బదిలీ
చేపట్టింది. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)