Breaking News

జాక్‌పాట్‌ కొట్టిన అనిల్‌ అంబానీ.. రూ. 600 కోట్ల ఆర్డర్‌

Published on Thu, 06/26/2025 - 07:56

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ డిఫెన్స్‌ తాజాగా జర్మనీ రక్షణ రంగ సంస్థ రైన్‌మెటల్‌ వాఫే మ్యునిషన్‌ జీఎంబీహెచ్‌ నుంచి రూ. 600 కోట్ల విలువైన ఆర్డర్‌ దక్కించుకుంది. హైటెక్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఇది అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్ట్‌గా కంపెనీ పేర్కొంది.

తాజా ఆర్డర్‌ గ్లోబల్‌ డిఫెన్స్, యుద్ధసామగ్రి విభాగంలో కంపెనీకి కీలక మైలురాయిగా అభివర్ణించింది. తద్వారా అంతర్జాతీయస్థాయిలో రక్షణ, యుద్ధసామగ్రి సరఫరా చైన్‌లో విశ్వసనీయ భాగస్వామిగా  రిలయన్స్‌ డిఫెన్స్‌ మరింత పటిష్టపడినట్లు తెలియజేసింది.

రెండు సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దీర్ఘకాలిక సహకారానికి కట్టుబాటుగా పేర్కొంది. అంతేకాకుండా ఆత్మనిర్భర్‌ భారత్, మేకిన్‌ ఇండియా లక్ష్యాలకు మద్దతుగా దేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను పటిష్టపరచనున్నట్లు వివరించింది.

👉 ఇది చదివారా? అనిల్‌ అంబానీకి భారీ ఉపశమనం

దీంతో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు దూసుకెళ్లాయి. జూన్ 25న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇన్‌‍ఫ్రా షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. మార్కెట్లు ముగిసే సమయానికి షేరు విలువ రూ. 404.65 వద్ద స్థిరపడింది.  రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ అనుబంధ సంస్థే రిలయన్స్ డిఫెన్స్‌.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)