Breaking News

అనిల్ అంబానీ సహయకుడి అరెస్ట్

Published on Sat, 10/11/2025 - 13:27

అనిల్ అంబానీ సహాయకుడు.. రిలయన్స్ పవర్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అయిన 'అశోక్ కుమార్ పాల్‌'ను ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ కేసుకు సంబంధించి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

రిలయన్స్ పవర్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్న అశోక్ పాల్‌కు.. రూ. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపైనే ఆయనను ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించిన ఈడీ.. గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు, శనివారం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కోరనున్నట్లు సమాచారం.

చార్టర్డ్ అకౌంటెంట్ అయిన పాల్.. 2023 జనవరి 29న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమితులయ్యారు. ఆయనకు సుమారు ఏడు సంవత్సరాలకు పైగా రిలయన్స్ పవర్‌తో అనుబంధం ఉంది. అయితే భువనేశ్వర్, కోల్‌కతాతో సహా పలు ప్రాంతాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ సోదాలు ప్రారంభించిన చాలా రోజుల తరువాత ఈ అరెస్టు చేయడం జరిగింది.

ఏమిటి ఈడీ కేసు
రిలయన్స్ పవర్‌తో పాటు.. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపైన రూ. 17వేల కోట్ల బ్యాంకు లోన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఆగస్టులో ముంబైలోని 35 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన తర్వాత ED దర్యాప్తు చేపట్టింది. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం.. కింద 50 కంపెనీలు, గ్రూప్‌తో సంబంధం ఉన్న 25 మంది వ్యక్తులను కవర్ చేసింది. తాజాగా సీఎఫ్ఓ అరెస్ట్ కేసులో మరింత కీలకంగా మారిందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: అరట్టై ప్రైవసీపై సందేహం: శ్రీధర్ వెంబు రిప్లై ఇలా..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)