Breaking News

‘ఉద్యోగాలకు ఏఐ ముప్పు తప్పదు’

Published on Tue, 07/01/2025 - 18:07

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కంపెనీల పనితీరును మార్చబోతోందని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఏఐ వాడకం పెరుగుతుండడంతో నిర్ణీత విభాగాల్లో తక్కువ మంది అవసరం అవుతారని చెప్పారు. సీఎన్‌బీసీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జాస్సీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సంస్థల్లో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో పోలిస్తే ఏఐ సమర్థవంతంగా ఆయా పనులు నిర్వహిస్తుందని అంగీకరించారు.

ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతున్నప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉపాధి అవకాశాలకు తెరతీస్తుందని జాస్సీ చెప్పారు. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేషన్‌ అవుతున్నప్పటికీ కృత్రిమ మేధ అభివృద్ధి, రోబోటిక్స్, మానవ నైపుణ్యాలు, ఆవిష్కరణలు అవసరమయ్యే ఇతర రంగాల్లో మరిన్ని మానవ వనరులు కావాలన్నారు.

ఇదీ చదవండి: వస్తు సేవల పన్ను విజయాల పరంపర

ఇతర కంపెనీల తీరిది..

సేల్స్‌ఫోర్స్‌ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏఐ తమ కంపెనీలో 30 నుంచి 50 శాతం పనులు చేస్తోందని వెల్లడించారు. షాపిఫై, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు ఏఐని తమ రోజువారీ పనిలో భాగం చేసుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. అమెజాన్‌లో పెద్ద ఎత్తున కృత్రిమ మేధను వినియోగిస్తున్నందున రాబోయే సంవత్సరాల్లో తమ ఉద్యోగులు తగ్గిపోయే అవకాశం ఉందని కంపెనీ ఇప్పటికే పరోక్షంగా హెచ్చరించింది.

Videos

Ambati Rambabu: ఏపీలో ఏడాదిగా శాంతి భద్రతలు క్షీణించిపోయాయి

కూటమి పాలనలో కునారిల్లుతున్న విద్యా వ్యవస్థ

పరవాడ, యలమంచిలిలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు గుర్తింపు

కస్తూర్బా వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఉషాశ్రీచరణ్

ఫారెన్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ YSRCP డిమాండ్

YS Jagan: ఆయన సేవలు చిరస్మరణీయం

పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి

National President: బీజేపీకి లేడీ బాస్?

మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు క్రమంగా కొనసాగుతున్న వరద

900 భూకంపాలు.. మరికొన్ని గంటల్లో సునామీ...!?

Photos

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)

+5

నలుగురు టాప్‌ హీరోయిన్లతో ధనుష్‌ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)

+5

చినుకుల్లో డార్జిలింగ్‌ అందాలు.. రా రమ్మని ఆహ్వానించే పచ్చటి కొండ కోనలు!

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

నేచురల్‌ బ్యూటీ 'వర్ష బొల్లమ్మ' స్పెషల్‌ ఫోటోలు చూశారా..? (ఫొటోలు)

+5

మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్​నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)