Breaking News

ఆండ్రాయిడ్‌ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ విడుదల

Published on Thu, 06/12/2025 - 15:15

గూగుల్‌ తన ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. యాపిల్ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఇటీవల ఐఓఎస్ 26ను ప్రకటించిన నేపథ్యంలో గూగుల్‌ కూడా పోటీగా ఆండ్రాయిడ్ 16ను లాంచ్ చేసింది. అయితే ఈ అప్‌డేట్‌ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన గూగుల్ పిక్సెల్ డివైజ్‌ల్లో మాత్రమే దీన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌ ద్వారా యూజర్లకు మరింత భద్రత, డిజైన్, పనితీరులో అనేక అప్‌గ్రేడ్‌లను తీసుకొస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది.

ఆండ్రాయిడ్ 16ను సపోర్ట్ చేసే ఫోన్ల జాబితా

గూగుల్ పిక్సెల్ ఫోన్లకు ముందుగా కొత్త సాఫ్ట్‌వేర్‌ కోసం యాక్సెస్ ఇస్తోంది. శామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌, షియోమీ వంటి ఇతర బ్రాండ్లు తమ కస్టమ్ ఆప్షన్లకు అనుగుణంగా ఆండ్రాయిడ్ 16ను రాబోయే కొన్ని నెలల్లో అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతానికైతే ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌ కింది మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని గూగుల్‌ పేర్కొంది.

పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6ఎ

పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఎ

పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8ఎ

పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 9ఎ

పిక్సెల్ ఫోల్డ్

పిక్సెల్ టాబ్లెట్

పైన తెలిపిన డివైజ్‌ల్లో దేనినైనా ఉపయోగిస్తుంటే ఆండ్రాయిడ్ 16 ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్‌గా కొత్త ఓఎస్‌ను అందిస్తారు.

ఎలా ఇన్‌స్టాల్‌ చేయాలంటే..

  • ముందుగా ఫోన్‌లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి.

  • కిందకు స్క్రోల్ చేసి సిస్టమ్‌ సెట్టింగ్స్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ట్యాప్ చేయాలి.

  • అప్‌డేట్‌ల కోసం చెక్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి.

  • ఒకవేళ ఆండ్రాయిడ్ 16 అందుబాటులో ఉంటే, డౌన్‌లోడ్‌ అండ్‌ ఇన్‌స్టాల్ ఆప్షన్‌ ట్యాప్ చేయాలి.

  • పూర్తయిన తర్వాత కొత్త వెర్షన్‌ను ఉపయోగించేముందు ఒకసారి ఫోన్‌ను రిస్టార్ట్‌ అవుతుంది.

ఇదీ చదవండి: అమెరికా బడ్జెట్‌ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!

కొన్ని ప్రధాన ఫీచర్లు ఇవే..

  • లాక్ స్క్రీన్‌పై లైవ్ అప్డేట్స్

  • అడ్వాన్స్‌డ్‌ ప్రొటెక్షన్

  • మెరుగైన యాప్ కంపాటబిలిటీ

  • అడాప్టివ్ యాప్స్ ఫీచర్‌తో ఆండ్రాయిడ్ 16 యాప్స్ ఆటోమేటిక్‌గా స్క్రీన్ సైజులకు అడ్జస్ట్ అయ్యేలా చేస్తుంది.

  • ఇది ఫోల్డబుల్ ఫోన్లు, టాబ్లెట్లకు అనుకూలంగా ఉంటుంది.

  • సెట్టింగ్స్‌లో కొత్త కలర్ హైలైట్స్, అప్‌డేటెడ్ ఫాంట్స్, స్లీకర్ మీడియా కంట్రోల్స్ అందిస్తుంది.

  • బ్యాటరీ హెల్త్ ఇండికేటర్ సూచిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)