Breaking News

ఎలాన్‌ మస్క్‌పై ట్విట్‌.. ఆనంద్‌ మహీంద్రాతో అట్లనే ఉంటది మరి!

Published on Mon, 07/11/2022 - 17:37

టెక్‌ దిగ్గజం, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఏం చేసినా అది వార్తల్లో నిలుస్తుంటుంది. అంతేనా ఆయన వ్యాఖ్యలే కాదు ట్వీట్‌లు కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. గత వారంలో మస్క్‌ ట్విటర్‌ డీల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మస్క్‌ పేరు మారుమోగుతోంది. తాజాగా భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎలాన్ మస్క్‌పై చేసిన సెటైరికల్‌ ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 

ఏముంది ఆ ట్విట్‌లో..
స్పామ్‌ అకౌంట్లకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైనందు వల్ల మస్క్‌ ట్విటర్‌ డీల్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. ఎలాన్ ఒక భారతీయ రైలులో ప్రయాణిస్తుంటే, కండక్టర్(TC) అతన్ని టీటీ (టిక్కెట్‌లెస్ ట్రావెలర్) అని ముద్రవేస్తాడు. అయితే అప్పుడప్పుడు ఆ టికెట్‌ లేని ప్రయాణికుడు కూడా వార్తల్లో నిలుస్తుంటాడని ట్విట్‌ చేశాడు. రూపాయి ఖర్చు పెట్టకుండానే మస్క్ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు అంటూ తనదైన శైలిలో మహీంద్రా చమత్కరించారు.

ప్రస్తుతం ఈ ట్విట్‌ వైరల్‌ కాగా దీని చూసిన ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. మస్క్‌కి బదులు మీరే కొనొచ్చు కదా ? పశ్చిమ దేశాలచే నియంత్రించబడే ఈ సోషల్ మీడియాపై మనము ఎక్కువగా ఆధారపడుతున్నామని కామెంట్‌ చేశాడు.


 

చదవండి: 'క్యూట్‌'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్‌.. ఇందులో నిజమెంత? 

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)