Breaking News

అమెరికాలో తొలిసారిగా అమూల్‌ పాలు

Published on Tue, 03/26/2024 - 00:58

న్యూఢిల్లీ: అమూల్‌ పాలు తొలిసారిగా విదేశీ మార్కెట్లలో లభించనున్నాయి. వారం రోజుల్లో అమెరికాలో అమూల్‌ పాలను ప్రవేశపెట్టనున్నట్లు గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) ఎండీ జయేన్‌ మెహతా తెలిపారు. ‘మేము దశాబ్దాలుగా డెయిరీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. కానీ తాజా పాలను భారత్‌ వెలుపల ప్రవేశపెట్టడం మాత్రం ఇదే ప్రథమం.

అమూల్‌ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్‌ ఎన్‌ ట్రిమ్‌ ఉత్పత్తులను వారం రోజుల్లో ప్రవేశపెడతాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం 108 ఏళ్ల చరిత్ర గల పాల సహకార సంఘం మిషిగాన్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (ఎంఎంపీఏ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు. పాల సేకరణ, ప్రాసెసింగ్‌ ఎంఎంపీఏ చేపడుతుందని, అమూల్‌ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్‌ తమ సంస్థ చేపడుతుందని మెహతా చెప్పారు.

ముందుగా న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్‌ తదితర ప్రాంతాల్లో అమూల్‌ పాలు లభిస్తాయి. వచ్చే 3–4 నెలల్లో బ్రాండింగ్, మార్కెటింగ్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు మెహతా చెప్పారు. రాబోయే రోజుల్లో పనీర్, పెరుగు, మజ్జిగ వంటి  ఉత్పత్తులను కూడా ప్రవేశపెడతామని తెలిపారు. జీసీఎంఎంఎఫ్‌ ఇప్పటికే 50 దేశాలకు పాల ఉత్పత్తలను ఎగుమతి చేస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)