Breaking News

ఈ యూరప్‌ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్‌!

Published on Mon, 06/08/2026 - 12:14

నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక నగరాల్లో ఒకటి. కనువిందు చేసే నీటి కాలువలు, చారిత్రక భవనాలు, మ్యూజియంలు, సాంస్కృతిక వైవిధ్యంతో ఏటా కోట్లాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్న ఈ నగరం ఇప్పుడు ‘ఓవర్‌ టూరిజం’ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల సంఖ్యను నియంత్రించడంతో పాటు నగర నిర్వహణకు అదనపు నిధులు సమకూర్చుకునేందుకు ఆమ్‌స్టర్‌డామ్‌ సిటీ ప్రభుత్వం పర్యాటక పన్నును భారీగా పెంచే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.

12.5 శాతం నుంచి 20 శాతానికి..

ప్రస్తుతం ఆమ్‌స్టర్‌డామ్‌లో హోటళ్లు, హాస్టళ్లు, ఇతర వసతి కేంద్రాల్లో బస చేసే పర్యాటకులపై గది అద్దెపై 12.5 శాతం పర్యాటక పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే క్రూయిజ్‌ నౌకల ద్వారా ఒక రోజు పర్యటనకు వచ్చే వారిపై ఒక్కొక్కరికి 15 యూరోలు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1650 పన్ను విధిస్తున్నారు.

కొత్త సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం 2027 నుంచి ఈ పన్నును 16 శాతానికి పెంచి, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక శాతం చొప్పున పెంచుతూ 2030 నాటికి 20 శాతానికి చేర్చనుంది. ఇది అమలైతే ప్రపంచంలోనే అత్యధిక పర్యాటక పన్నులు విధించే నగరాల్లో ఆమ్‌స్టర్‌డామ్‌ ఒకటిగా నిలవనుంది.

నగరంపై పెరుగుతున్న ఒత్తిడే కారణం

పర్యాటకం నగర ఆర్థిక వ్యవస్థకు కీలక ఆదాయ వనరు అయినప్పటికీ, అదే సమయంలో జనసమ్మర్థ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు, స్థానికుల జీవన ప్రమాణాలపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోందని సిటీ ప్రభుత్వం పేర్కొంది. అందుకే నగర నిర్వహణ, పరిశుభ్రత, భద్రత, చట్ట అమలు, మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చుల్లో పర్యాటకులు కూడా తగిన వాటా భరించాలని భావిస్తోంది. పన్ను పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

క్రూయిజ్‌ టెర్మినల్‌కు కూడా గుడ్‌బై?

పన్ను పెంపుతో పాటు మరికొన్ని కఠిన నిర్ణయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సముద్ర క్రూయిజ్‌ నౌకల ద్వారా వచ్చే పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు నగరంలోని ప్రధాన క్రూయిజ్‌ టెర్మినల్‌ను మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జాతీయ ప్రభుత్వం, ప్రాంతీయ అధికారులతో చర్చల అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనుంది.

అదనంగా, కాలువలపై బోటు టూర్లు, అద్దె పడవలు వంటి వినోద కార్యకలాపాలపై కూడా అధిక రుసుములు విధించే అవకాశాలు ఉన్నాయి. నగర కేంద్రంలోని కొన్ని భవనాలను కొనుగోలు చేసి, వాటి వినియోగాన్ని మార్చడం ద్వారా అధిక పర్యాటక ఒత్తిడిని తగ్గించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నారు.

రెడ్‌ లైట్‌ ప్రాంతానికి ప్రత్యామ్నాయం

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆమ్‌స్టర్‌డామ్‌ రెడ్‌ లైట్‌ డిస్ట్రిక్ట్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు నగర దక్షిణ ప్రాంతంలో ప్రత్యేక “ఎరోటిక్‌ సెంటర్‌” ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సెక్స్‌ వర్కర్లకు మరింత భద్రత కల్పించడం, నేర కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడం, నగర కేంద్రంలో రద్దీని నియంత్రించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.

పర్యాటకులను ఆహ్వానిస్తూనే నియంత్రణ

గత కొన్నేళ్లుగా ఆమ్‌స్టర్‌డామ్‌ ‘టూరిజం ఇన్‌ బ్యాలెన్స్‌’ విధానాన్ని అమలు చేస్తోంది. పర్యాటకులను పూర్తిగా నిరోధించడం కాకుండా, నగర సామర్థ్యానికి మించి పెరుగుతున్న సందర్శకుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలు, యునెస్కో వారసత్వ హోదా పొందిన కాలువల వలయం, సైకిల్‌ సంస్కృతి కారణంగా ఆమ్‌స్టర్‌డామ్‌ ఇప్పటికీ ఐరోపాలో అత్యధికులు సందర్శించాలనుకునే పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇకపై అక్కడికి వెళ్లే పర్యాటకులు మరింత ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సి రావచ్చు.

Videos

Viral Video: సగం తిన్న యాపిల్ ను జనాల్లోకి విసరిన డీకే శివకుమార్

ఇంత దరిద్రపు పాలనను .. ఎప్పుడు చూడలేదు..!

స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ

రేపు విశాఖలో జగన్ పర్యటన

ట్రంప్ ఒక్క ఫోన్ కాల్‌తో వెనక్కి తగ్గిన..!

ప్రస్టేషన్ ఎక్కువై YSRపై నిందలు, KVP మొట్టికాయలు

నారాసుర గొడ్డలిపోటు... చంద్రబాబు వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి ఫైర్

పాపం.. కారున్నా నడపలేడు బుడ్జోడికి ఎంత కష్టం వచ్చిందో

చంపేస్తాం.. వైఎస్ఆర్ సీపీ నేతలకు జేసీ బెదిరింపులు

స్టీల్ ప్లాంట్లో ప్రమాదాల వెనుక కారణం ఇదే?

Photos

+5

కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్‌’ఫుల్‌ ఫోటోస్‌

+5

బాలీవుడ్ బ్యూటీ నేహ కక్కర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తన ముద్దుల గారాలపట్టితో బిగ్‌బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)

+5

శారీలో అనసూయ గ్లామర్ చూశారా? (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ప్రియాంక మోహన్‌ స్టన్నింగ్‌ స్టిల్స్‌

+5

టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు

+5

క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?

+5

హైదరాబాద్​: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)