Breaking News

ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త!

Published on Mon, 06/19/2023 - 11:01

ఎటు చూసినా ఉద్యోగాల కోతతో ఆందోళలో ఉన్న ఐటీ ఉద్యోగులకు, ఉద్యోగాలు వస్తాయో రావో అంటూ భయం భయంగా  ఉన్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు అమెరికా సంస్థ తీపి కబురు అందించింది.  మెటా, ట్విటర్‌,  అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి టెక్‌దిగ్గజ సంస్థలు ఖర్చలు తగ్గింపుపేరుతో వేలాది మందిని తొలగిస్తున్న తరుణంలో ఐటీ కంపెనీ ఆక్స్ట్రియా (Axtria Inc) శుభవార్త  చెప్పింది.

డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ , డేటా ఇంజినీరింగ్ రంగాలలో 1,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. గురుగ్రామ్, బెంగళూరు , నోయిడాలోఇప్పటికే ఉన్న ఆఫీసులతో పాటు పూణే  హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కార్యాలయాల్లో కొత్త ఉద్యోగాలు  కల్పిస్తున్నట్టు   సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రాబోయే 8-10 నెలల్లో 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, డేటా ఇంజనీర్‌లతో ఈ అవకాశాలను సృష్టించనున్నట్టు వెల్లడించింది.  వచ్చే ఐదేళ్లలో డేటా సైన్స్ లో  చాలా మార్పు వస్తుందనీ  పీపుల్ ప్రాక్టీసెస్ హెడ్ శిఖా సింఘాల్  భావిస్తున్నారు.  (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్‌, ఇంకా విశేషాలు)

అంతేకాదు రానున్న రెండేళ్లలో ఇంటెన్సివ్ క్యాంపస్ నియామకానికి సిద్ధమవుతోంది.ఇప్పటికే 2023కి సంబంధించి అగ్రశ్రేణి  ఐఐటీ ప్లేస్‌మెంట్ కార్యాలయాలతో పాటు ఇతర ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తాజా నివేదికల సమాచారం. ప్రస్తుతం ఈ కంపెనీలో  దేశవ్యాప్తంగా  3 వేల మంది  ఆక్స్ట్రియాలో  పని చేస్తున్నారు.

మరిన్ని ఇంట్రస్టింగ్‌  కథనాలు, బిజినెస్‌ అప్‌డేట్స్‌  కోసం చదవండి: సాక్షిబిజినెస్‌

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)