గూగుల్ ఉద్యోగుల ఆందోళన.. సుందర్ పిచాయ్‌కు వినతి!

Published on Tue, 07/21/2026 - 15:04

ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల పనులు వేగంగా, సులభంగా పూర్తవుతున్నాయి. అయితే.. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయా?.. అనే భయం కూడా చాలా మందిలో పెరుగుతోంది. ఇదే ఆందోళన ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం అయిన గూగుల్ ఉద్యోగుల్లో కూడా కనిపిస్తోంది. దీంతో సుమారు 4500 మందికిపైగా ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్‌కు ఒక పిటిషన్ సమర్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

సుందర్ పిచాయ్‌కు అందించిన పిటిషన్‌లో.. ఏఐ కోసం కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు ఉద్యోగులను తొలగించడం సరికాదని వెల్లడించారు. ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా.. కొత్త విధానాలు తీసుకురావాలని వారు కోరారు. అంతే కాకుండా క్యాంపస్ వెలుపల 100 మంది ఉద్యోగులు శాంతియుతంగా నిరసన కూడా చేపట్టారు. ఉద్యోగ భద్రత కోసం.. గూగుల్ చరిత్రలో జరిగిన అతిపెద్ద ఉద్యమాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు.

ఉద్యోగుల డిమాండ్ ఏమిటంటే కంపెనీ లేఆఫ్‌లు చేయాల్సి వచ్చినా.. ముందుగా స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలే అవకాశం ఇవ్వాలి. ఉద్యోగం కోల్పోయే వారికి తగిన సెవరెన్స్ ప్యాకేజీ అందించాలి. అలాగే ఉద్యోగుల పనితీరును అంచనా వేసే విధానంలో కూడా మార్పులు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం చాలామందికి అన్యాయం చేస్తోందని ఉద్యోగులు భావిస్తున్నారు.

గతంలో కూడా గూగుల్ ఉద్యోగులు.. నైతిక అంశాలపై, ఏఐ వినియోగంపై నిరసనలు చేశారు. కానీ.. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు వారి ఆందోళన పూర్తిగా తమ ఉద్యోగాల గురించే. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనే భయం వారిని ఈ ఉద్యమానికి దారితీసింది.

ఇదీ చదవండి: వెకేషన్‌కు వెళ్లాడు.. ఉద్యోగం పోయింది!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)