Breaking News

amazon prime : ప్రైమ్ యూజర్లకు భారీ షాక్!

Published on Tue, 02/13/2024 - 16:44

ఓటీటీ లవర్స్‌కి అమెజాన్‌ ప్రైమ్‌ భారీ షాకిచ్చింది. త్వరలో ‘హైక్వాలిటీ’ పేరుతో యూజర్ల నుంచి డబ్బుల్ని వసూలు చేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే.. మిగిలిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సైతం అమెజాన్‌ ప్రైమ్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకుల అంచనా.

కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు సగటు సినీ ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లి ఎందుకు సినిమా చూడడం లేదనేదానికి అన్నే కారణాలు ఉన్నాయి. అయితే సినిమా, థియేటర్లు అనే అంశాలు కాసేపు అటుంచితే.. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌ మెంట్‌ విభాగంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు మంచి డిమాండ్‌ ఉంది. ఆ డిమాండ్‌నే క్యాష్‌ చేసుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. 

బొమ్మ ఫుల్‌ హెచ్‌డీలో కనబడాలంటే
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం తమ ఆదాయాన్ని, సబ్‌స్కైబర్‌ బేస్‌ను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం పాస్ వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడం, యాడ్ ఫ్రీ వ్యూయింగ్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం వంటి పలు మార్పులు చేస్తున్నాయి. తాజాగా, అమెజాన్ ప్రైమ్ ఇటీవల డాల్బీ విజన్ హెచ్‌ఆర్‌, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ ఫీచర్లను తన స్టాండర్డ్‌ సర్వీసుల నుండి తొలగించింది. ఇప్పుడు హైక్వాలిటీ ఆడియో,వీడియో స్ట్రీమింగ్‌ వీడియోల్ని వీక్షించాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాలని యూజర్లను కోరుతుంది.  

ఎంత మొత్తం చెల్లించాలంటే?
అమెజాన్ తన పెయిడ్ సబ్ స్క్రిప్షన్‌కు యాడ్స్ జోడించడమే కాకుండా హై క్వాలిటీ ఆడియో, వీడియో ఆప్షన్‌ను తొలగించింది. వినియోగదారులు ఇప్పుడు తమ అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పై నెలకు 2.99 డాలర్లు చెల్లించి క్వాలిటీని తిరిగి పొందవచ్చు. యాడ్స్‌ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మార్పులు, చేర్పులు చేసే సమయంలో సబ్‌స్కైబర్లు భారీగా తగ్గిపోతున్నారు. ఇతర ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ తీసుకునే నిర్ణయం ఆ సంస్థపై ఎలాంటి ప్రతికూలా ప్రభావం చూపనుందో తెలియాల్సి ఉంది.

చదవండి👉 Elon Musk: మూడు లక్షల కోట్లు తగలెట్టేశాడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)