Breaking News

అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌: భారీగా పెరిగిన ఈ-కామర్స్‌ ఎగుమతులు

Published on Fri, 07/07/2023 - 10:19

న్యూఢిల్లీ: దేశీ ఎగుమతిదారులు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కి చెందిన గ్లోబల్‌ సెల్లింగ్‌ ప్రోగ్రాం ద్వారా ఇప్పటివరకూ చేసిన ఎగుమతులు ఈ ఏడాదితో 8 బిలియన్‌ డాలర్లు దాటనున్నాయి. గతేడాది ఇవి 5 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు అమెజాన్‌ తమ ఎక్స్‌పోర్ట్స్‌ డైజెస్ట్‌ 2023 నివేదికలో పేర్కొంది. 2015లో అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.25 లక్షల ఎగుమతిదారుల స్థాయికి చేరినట్లు వివరించింది. 1,200 మంది భారతీయ ఎగుమతిదారులు గతేడాది రూ. 1 కోటి విక్రయాలు సాధించినట్లు అమెజాన్‌ తెలిపింది.

అత్యధికంగా ఎగుమతైన వాటిల్లో బొమ్మలు (50 శాతం), గృహ .. వంటగది ఉత్పత్తులు (35 శాతం), సౌందర్య సాధనాలు (25 శాతం) ఉన్నాయి. 2025 నాటికి భారత్‌ నుంచి మొత్తం ఈ-కామర్స్‌ ఎగుమతులు 20 బిలియన్‌ డాలర్లకు చేరేలా తోడ్పడేందుకు లక్షల కొద్దీ చిన్న వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లతో కలిసి పని చేయనున్నట్లు అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ భూపేన్‌ వాకంకర్‌ తెలిపారు. అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ ప్రోగ్రాం ద్వారా అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ తదితర దేశాలకు 26.6 కోట్ల పైచిలుకు మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులు ఎగుమతవవుతు న్నాయని నివేదిక పేర్కొంది.  2023లో ఎగుమతులపరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)