Breaking News

ఈ ఏడాది చివరి నాటికి రూ.1.08 లక్షల కోట్లు!.. అమెజాన్‌ డైరెక్టర్‌

Published on Sat, 09/07/2024 - 07:08

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ (అమెజాన్‌ ఇండియా ఎగుమతుల కార్యక్రమం) ఎగుమతులు ఈ ఏడాది చివరికి మొత్తంగా 13 బిలియన్‌ డాలర్లకు (రూ.1.08 లక్షల కోట్లు) చేరుకుంటాయని సంస్థ డైరెక్టర్‌ భూపేన్‌ వకంకర్‌ తెలిపారు. 2025 నాటికి 20 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునే మార్గంలోనే ఉన్నట్టు చెప్పారు. 

2015లో అమెజాన్‌ ఇండియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి భారత్‌లో తయారైన 40 కోట్లకుపైగా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అందించినట్టు వకంకర్‌ తెలిపారు. 2015 నుంచి 2023 మధ్య అమెజాన్‌ 8 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే నమోదు చేయగా, కేవలం ఏడాది వ్యవధిలోనే (2023–24) 13 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్టు వివరించారు. 

గడిచిన 12 నెలల్లో 50వేల కొత్త విక్రేతలను ఇందులో చేర్చుకున్నట్టు తెలిపారు. దీంతో మొత్తం విక్రేతల సంఖ్య 1.5 లక్షలకు చేరుకున్నట్టు వెల్లడించారు. దేశీ విక్రేతలు అంతర్జాతీయ బ్రాండ్ల సృష్టికి అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ వీలు కల్పిస్తోంది. 

సౌందర్య ఉత్పత్తుల ఎగుమతులు 2023లో 40 శాతం వృద్ధిని చూడగా, వస్త్రాలు, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యధిక వృద్ధితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యూఎస్, యూకే, కెనడా, జర్మనీ భారత విక్రేతలకు ప్రధాన ఎగుమతి మార్కెట్లుగా ఉన్నట్టు అమెజాన్‌ విడుదల చేసిన ‘ది ఎక్స్‌పోర్ట్స్‌ డైజెస్ట్‌ 2024’ నివేదిక వెల్లడించింది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)