Breaking News

అమెజాన్‌ కొత్తగా మరో 40 ఆశ్రయ్‌ కేంద్రాలు

Published on Tue, 08/26/2025 - 18:04

ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా తాజాగా తమ ఆశ్రయ్‌ ప్రాజెక్టును మరింతగా విస్తరించింది. ప్రభుత్వ రంగ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)తో కలిసి మరో 40 కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో వీటి సంఖ్య 13 నగరాలవ్యాప్తంగా 65కి చేరింది. 2025 ఆఖరు నాటికి ఇలాంటి 100 సెంటర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు అమెజాన్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ (ఇండియా) సలీం మెమన్‌ తెలిపారు.

పెట్రోల్‌ బంకులు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ఈ సెంటర్స్‌.. అమెజాన్‌ సొంత నెట్‌వర్క్‌లోని వారితో పాటు ఈ–కామర్స్, లాజిస్టిక్స్‌ వ్యవస్థలోని ఇతరత్రా డెలివరీ అసోసియేట్స్‌ కూడా కాసేపు సేద తీరేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఎయిర్‌ కండీషన్డ్‌ సీటింగ్, తాగు నీరు, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు, వాష్‌రూమ్‌లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ మొదలైనవి ఉంటాయి. ఉదయం 9 గం.ల నుంచి రాత్రి 9 గం.ల వరకు, ఏడాదిపాడవునా, వారానికి ఏడు రోజులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ట్రాఫిక్‌ రద్దీ, వాతావరణ మార్పులతో ఇబ్బందిపడే డెలివరీ అసోసియేట్స్‌ ప్రతి విజిట్‌లో అరగంట సేపు దీన్ని ఉపయోగించుకోవచ్చు.

ఇదీ చదవండి: బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)