Breaking News

కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్‌.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో!

Published on Thu, 01/05/2023 - 15:30

అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలు వెరసి కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. దీంతో దిగ్గజ సంస్థలు సైతం లేఆఫ్‌ల మంత్రం అనుసరిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా తమ సిబ్బందిని తగ్గించుకుంటూ పోతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా జరగుతున్న పరిణామాలు, కంపెనీ నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థలోని 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. గతంలో కూడా  ఈ దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థ ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే.

18 వేల మంది తొలగింపు
‘ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని మేము నవంబర్‌లోనే ప్రకటించాము. ప్రస్తుతం 18,000 సిబ్బందిని తొలగించాలని ప్లాన్ చేస్తున్నామని’ సీఈఓ ఆండీ జాస్సీ ఒక ప్రకటనలో తెలిపారు. జాస్సీ మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాల తొలగింపు చాలా మందిని ప్రభావితం చేస్తాయని తెలుసు, కానీ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఈ లేఆఫ్‌లు వల్ల ప్రభావితమైన వారికి సపోర్ట్‌ ఇచ్చేందుకు కంపెనీ సహకరిస్తుందన్నారు. వారి చెల్లింపులు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, వేరే కంపెనీలో ఉద్యోగం కోసం కావాల్సిన సపోర్ట్‌ వంటి ప్యాకేజీలను అందిస్తున్నామని చెప్పారు. కొన్ని తొలగింపులు యూరప్‌లో ఉంటాయని, జనవరి 18 నుంచి ఎవరని తొలగించారనేది తెలుస్తుందని జాస్సీ చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల మంది ఉద్యోగులుండగా.. తాజా నిర్ణయాలతో 6 శాతం మంది ఉద్యోగులు ఇంటి బాటపట్టనున్నారు.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్‌ టికెట్‌ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)