Breaking News

సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట!

Published on Mon, 06/19/2023 - 18:19

మీ వద్ద రూ.2000 నోట్లున్నాయా? వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకో శుభవార్త. రూ.2000 నోట్ల సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వినియోగదారులకు బంపరాఫర్‌ ప్రకటించింది. మీరు ఎక్కడి నుంచైనా సరే అమెజాన్‌ పే క్యాష్‌లో నెలకు రూ.50,000 వరకు రూ.2000 నోట్లను డిపాజిట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కస్టమర్లు అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ అకౌంట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్‌ అకౌంట్లకు ఆ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చని తెలిపింది. 

రూ.2,000 నోట్లను ఎలా డిపాజిట్‌ చేయాలి?
ఈ సందర్భంగా అమెజాన్‌ పే’లో క్యాష్‌ ఎలా డిపాజిట్‌ చేయాలో అమెజాన్‌ తెలిపింది. ఆర్డర్‌ పెట్టుకున్న వస్తువు డెలివరీ అయ్యే సమయంలో నగదు చెల్లిస్తుంటాం. ఆ సమయంలో డెలివరీ అసోసియేట్‌కు మన వద్ద ఉన్న రూ.2000 నోట్లను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అసోసియేట్లు మనం ఎంత విలువైన రూ.2,000 నోట్లను ఇచ్చామో.. ఆ మొత్తాన్ని మన బ్యాంక్‌ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

రూ.2,000 నోటు ఉపసంహరణ
మేలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించింది. ప్రజలు సెప్టెంబర్ 30లోపు కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అత్యధిక విలువ కలిగిన కరెన్సీని ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఉండవని హామీ ఇచ్చారు. ప్రతికూల అంశాలు తక్కువగా ఉంటాయని, ఆ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆర్‌బీఐ తక్షణమే పరిష్కరిస్తుందని పునరుద్ఘాటించారు.

చదవండి : ఎయిర్‌టెల్‌ యూజర్లకు బంపరాఫర్‌.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే?

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)