Breaking News

భారత్‌లోకి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వెల్లువ 

Published on Sat, 07/19/2025 - 04:49

కోల్‌కతా: దేశీయంగా ప్రత్యామ్నాయ పెట్టుబడుల మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈక్విటీలతో పోలిస్తే తక్కువ రిస్క్‌లు, ఒడిదుడుకులతో అత్యధిక రాబడులను కోరుకునే ఫ్యామిలీ ఆఫీస్‌లు, కార్పొరేట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పరిశ్రమ నిపుణులు తెలిపారు. దీనితో ఈ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంచర్‌ క్యాపిటల్, హెడ్జ్‌ ఫండ్స్, రియల్‌ ఎస్టేట్, కమోడిటీల్లాంటివి ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేటగిరీలోకి వస్తాయి. 2025 మార్చి నాటికి ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌లోకి (ఏఐఎఫ్‌) రూ. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు హామీలు వచి్చనట్లు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌–టైమ్‌ సభ్యుడు అనంత నారాయణ తెలిపారు. 

గతేడాదితో పోలిస్తే ఇది రూ. 1.7 లక్షల కోట్లు అధికమని వివరించారు. గత అయిదేళ్లుగా చూస్తే ఏఐఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హామీలు, పెట్టుబడులు వార్షికంగా 30 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఈ విభాగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000–40,000 కోట్లుగా ఉన్న పరిశ్రమ 2027 నాటికి పది రెట్లు పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న అథా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ విశాల్‌ విఠ్లానీ తెలిపారు. సంప్రదాయ ఫిక్సిడ్‌ ఇన్‌కం సాధనాలతో పోలిస్తే అత్యధికంగా 16–18 శాతం ఈల్డ్‌లు అందిస్తూ,  ఏఐఎఫ్‌లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)