Breaking News

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు అలర్ట్‌!

Published on Sat, 12/30/2023 - 16:16

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లు వాడుతున్నారా..? ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్‌లు వినియోగిస్తున్నారా..? అయితే మీకో ముఖ్యమైన సమాచారం. కొన్ని యూపీఐ ఐడీలు డిసెంబర్‌ 31 నుంచి పనిచేయవు. అవేంటి.. ఎందుకు పనిచేయవు.. ఇక్కడ తెలుసుకోండి..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ విస్తృతమయ్యాయి. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతిఒక్కరూ ఈ యాప్‌లను ఉపయోగించే చెల్లింపులు చేస్తున్నారు. చిరు దుకాణాల దగ్గర నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ వరకూ యూపీఐ చెల్లింపులే అత్యధికం ఉంటున్నాయి. 

ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివాటితోపాటు ఇంకా మరికొన్ని యూపీఐ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆయా యాప్‌లు రకరకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి అందిస్తున్నాయి. దీంతో చాలా మంది వివిధ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని కొద్దికాలం వినియోగించి మళ్లీ వాటి గురించి మరిచిపోతున్నారు. ఇలా 2023 డిసెంబర్ 31 నాటికి ఒక సంవత్సరం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆయా యాప్‌లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కోరింది.

కారణం ఇదే..
బ్యాంక్‌ అకౌంట్‌లకు లింక్‌ చేసిన ఫోన్‌ నంబర్‌లను డీలింక్ చేయకుండా కస్టమర్‌లు ఫోన్ నంబర్‌లను మార్చినప్పుడు పాత నంబర్‌ల ద్వారా లావాదేవీలు జరగకుండా చూడటమే ఇన్‌యాక్టివ్‌ యూపీఐ ఐడీల డీయాక్టివేషన్‌ లక్ష్యమని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాల ప్రకారం, 90 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కొత్త సబ్‌స్క్రైబర్‌లకు టెల్కోలు డియాక్టివేటెడ్ నంబర్‌లను జారీ చేస్తుంటాయి.

 

బ్యాంక్‌తో లింక్‌ చేసిన పాత మొబైల్‌ నంబర్‌ను కస్టమర్‌ అప్‌డేట్ చేసుకోకపోతే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు  2023 డిసెంబర్ 31 లోపు ఈ విషయంపై తగిన చర్య తీసుకోవాలని ఎన్‌పీసీఐ కోరినట్లు సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)