Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అలర్ట్‌.. 4 రోజులు అంతరాయం

Published on Fri, 01/17/2025 - 15:21

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు (HDFC Bank) సంబంధించిన పలు సేవలు నాలుగు రోజులు అందుబాటులో ఉండవు. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తమ కస్టమర్లకు అలర్ట్‌ జారీ చేసింది. నిర్వహణ పనుల నిమిత్తం జనవరి 17, 18, 24, 25 తేదీల్లో పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది.

కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వివరించింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవనేది కస్టమర్లకు సమాచారం అందించింది.

జనవరి 17న తెల్లవారుజామున 2:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు 3 గంటల పాటు ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీస్‌  అందుబాటులో ఉండదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో ప్రీపెయిడ్ కార్డ్ నెట్‌బ్యాంకింగ్, ఇన్‌స్టంట్ రీలోడ్ పోర్టల్ ద్వారా ఫారెక్స్ కార్డ్ రీలోడ్ చేయడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫారెక్స్ కార్డ్‌లను రీలోడ్ చేయవచ్చు.

జనవరి 18, 25 తేదీలలో అర్ధరాత్రి 12:00 నుండి ఉదయం 3:00 వరకు యూపీఐ (UPI) సర్వీస్‌ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలపై యూపీఐ లావాదేవీలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ యాప్‌లలో యూపీఐ సర్వీస్‌ నిలిపేస్తారు. మర్చెంట్‌ యూపీఐ లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.

ఇక జనవరి 24, 25 తేదీల్లో చాట్‌బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్‌ (SMS) బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ ఐవీఆర్‌ (IVR) సేవల్లో అంతరాయం ఉంటుంది. జనవరి 24 రాత్రి 10:00 గంటల నుండి జనవరి 25 మధ్యాహ్నం 2:00 గంటల వరకు (మొత్తం 16 గంటలు) చాట్‌బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్‌ బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ ఐవీఆర్‌ సేవలపై పని చేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. ఈ సమయంలో ఈ సేవలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.

కస్టమర్లకు అలర్ట్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ అప్‌డేట్‌ను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ చిరునామా ద్వారా కస్టమర్‌లకు పంపింది. ఈ తేదీలు, సమయాల్లో ఇతర ఎంపికలను ఉపయోగించాలని సూచించించింది. తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ అవసరమైన నిర్వహణను పూర్తి చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  తెలిపింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని కస్టమర్‌లకు సూచించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)