Breaking News

బంగారం..  కొనేదెలా..? 

Published on Sat, 04/26/2025 - 05:38

న్యూఢిల్లీ: బంగారం ధర రూ.లక్షలకు పెరిగిపోవడం వినియోగదారులు, ముఖ్యంగా మహిళల ఆకాంక్షలపై నీళ్లు చల్లినట్లయింది. భారతీయ మహిళలకు బంగారంతో విడదీయలేని అనుబంధమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య కుటుంబాలకు చెందిన వారు సైతం బంగారు ఆభరణాల కోసమని చెప్పి తమకు తోచినంత పొదుపు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ధరలు అసాధారణంగా పెరిగిపోవడాన్ని వారు ఇప్పుడు జీరి్ణంచుకోలేకపోతున్నారు. 

ఏటా వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ(మొదటి తదియ), వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధరలు 22 శాతం పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జవవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.79,390గా ఉండగా, అక్కడి నుంచి చూస్తే రూ.1.01 లక్షల వరకు వెళ్లి ప్రస్తుతం రూ.98వేల స్థాయిలో ఉంది.  

ఇలా అయితా ఎలా కొనగలం? 
‘‘వచ్చే నవంబర్‌లో నా కుమార్తె వివాహం ఉంది. ఈలోపే బంగారం ధర గణనీయంగా పెరిగింది. ఇప్పుడు వివాహం కోసం బంగారం ఎలా కొనుగోలు చేయాలి?’’ అన్నది నోయిడాకు చెందిన రూప అభిప్రాయం. పండగలు, వివాహాల సమయంలో బంగారం కొనుగోలు చేయకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందని ఢిల్లీ మయూర్‌ విహార్‌కు చెందిన సుశీలా దేవి మనోగతం. గతంలో 10 గ్రాములు కొనేవాళ్లం కాస్తా.. ఇప్పుడు 5 గ్రాములతో సరిపెట్టుకోవడమేనని నిర్వేదం వ్యక్తం చేశారు. ‘‘నాకు బంగారం ఆభరణాలంటే ఎంతో ఇష్టం. 

అందుకే ఏటా ఒకసారి కొనుగోలు చేస్తుంటా. ధర రూ.లక్షకు చేరడం నన్ను కలచివేస్తోంది’’అని ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లా వాసి సీతా సాహు తెలిపారు. మరోవైపు చెప్పుకోతగ్గ స్థాయిలో బంగారం ఆభరణాలను సమకూర్చుకున్నవారు.. ధరలు భారీగా పెరిగిపోవడం పట్ల ఒకింత ఆనందాన్నీ వ్యక్తం చేస్తున్నారు. ‘‘నా భర్త ఏటా బంగారం కొనిపెడుతుండేవారు. కానీ, నేడు ఆయన లేకపోయినప్పటికీ.. ఆభరణాలు మాత్రం నాకు గౌరవంతోపాటు, మద్దతుగా నిలుస్తున్నాయి’’అని పుణెకు చెందిన అర్చనా దేశ్‌ముఖ్‌ (65) చెప్పారు.  

అమ్మకాలపై ప్రభావం..  
ధరల పెరుగుదలతో అమ్మకాలు తగ్గుతున్నట్టు ఆభ రణాల వర్తకులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వర్తకులపై దీని ప్రభావం ఎక్కువగా కనిపి స్తోంది. ‘‘దశాబ్దాల నుంచి ఇదే వ్యాపారంలో ఉ న్నాం. మొదటిసారి కస్టమర్ల మొహాల్లో అయోమయాన్ని చూస్తున్నాం. గతంలో కస్టమర్లు ఆభరణాల డిజైన్లను ఎన్నింటినో చూసేవారు. ఇప్పుడు వాటిని చూసి వెనక్కి ఇచ్చేస్తున్నారు. ధరలు ఇలాగే పెరిగితే చిన్న వర్తకులు కొనసాగడం కష్టమే’’అని ఢిల్లీ మ యూర్‌ విహార్‌కు ‘ఊరి్మళా జ్యుయలర్స్‌’ స్వర్ణకారి ణి సోనూసోని తెలిపారు. కానీ మహిళలు బంగా రం తప్పకుండా పొదుపు చేసి, ఆభరణాలను కొనుగోలు  చేస్తూనే ఉంటారని రాధేశ్యామ్‌ జ్యుయలర్స్‌కు చెందిన కరణ్‌ సోని అభిప్రాయపడ్డారు.  

లైట్‌ వెయిట్‌ జ్యుయలరీకి డిమాండ్‌? 
బంగారం ధరలు పెరిగిపోవడంతో ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లు తేలికపాటి ఆభరణాలను కొనుగోలు చేయొచ్చని జ్యుయలర్లు అంచనా వేస్తున్నారు. ‘‘అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ధరలు పెరిగినప్పటికీ లైట్‌ వెయిట్‌ ఆభరణాల రూపంలో మంచి డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రాజేష్‌ రోక్డే తెలిపారు. 

ధరల పెరుగుదల పట్ల కస్టమర్లు అసహనం వ్యక్తం చేసినప్పటికీ.. సురక్షిత సాధనంగా, మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం కావడంతో క్రమంగా అమ్మకాలు సానుకూల స్థితికి చేరుకుంటాయన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో విక్రయాలను పెంచుకునేందుకు వర్తకులు అన్ని రకాల ధరల్లో ఆభరణాలను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధిక ధరలతో అమ్మకాల పరిమాణం క్రితం ఏడాది స్థాయిలోనే ఉండొచ్చని లేదా 10 శాతం వరకు తగ్గొచ్చని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ అవినాష్‌ గుప్తా అభిప్రాయపడ్డారు. అక్షయ తృతీయ, వివాహాల సీజన్‌ కావడంతో విక్రయాల పట్ల ఆశావహంగా ఉన్నట్టు పీఎన్‌జీ జ్యుయలర్స్‌ చైర్మన్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ పేర్కొన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)