Breaking News

వారసురాలొచ్చేసింది.. అంబానీ ఇంట మళ్ళీ ఆనందాల వెల్లువ..!!

Published on Thu, 06/01/2023 - 10:35

భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముకేశ్‌ అంబానీ' (Mukesh Ambani) ఇంటికి వారసురాలు వచ్చేసింది. ముకేశ్‌  పెద్ద కొడుకు 'అకాశ్‌ అంబానీ & శ్లోక మెహతా' దంపతులు మరో సారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా బుధవారం హాస్పిటల్‌లో ఆడబిడ్డకు జన్మనించింది.

అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో కుటుంభం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. 2019లో ఆకాష్, శ్లోకల వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నట్లు అందరికి తెలుసు. కాగా ఇప్పుడు మరో పండంటి బిడ్డకు ఆ దంపతులు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అంబానీ కుటుంబానికి సన్నిహితుడైన 'పరిమల్ నథ్వానీ' ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో ఆకాష్, శ్లోక అంబానీల ప్రిన్సెస్ రాకకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈ అమూల్యమైన క్షణాలు జీవితంలో అపారమైన ప్రేమను తెస్తాయని ట్వీట్ చేశారు. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?)

2023 ఏప్రిల్ నెలలో ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో కనిపించిన శ్లోక మెహతా మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది.

(ఇదీ చదవండి: మళ్ళీ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?)

ఇదిలా ఉండగా గత సంవత్సరం ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రసవించిన ఈమె ఇండియాకు కవలలతో రావడంతో అంబానీ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. ఆ సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి వేదపండితులు రప్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అంతే కాకుండా ఇంటికి కవలలు వచ్చిన సంతోషంతో సుమారు 300 కేజీల బంగారం దానం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఐదు అనాధ శరణాలయాలు కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)