Breaking News

ఎయిర్‌టెల్‌ రీచార్జ్‌ ప్లాన్లు.. రూ.200 దగ్గరలో మంత్లీ వ్యాలిడిటీ

Published on Thu, 02/27/2025 - 21:45

ఇటీవల టెలికాం రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. దీంతో ఒకటి కంటే ఎక్కువ మొబైల్‌ నంబర్లను వినియోగిస్తున్నవారికి మరింత భారంగా మారింది. పెద్ద డేటా ప్యాకేజీలు కాకుండా తమ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకుంటే చాలని కొంతమంది యాజర్లు భావిస్తున్నారు. మీరు ఎయిర్‌టెల్ కస్టమర్‌ అయి ఇటువంటి తక్కువ ధరలో రీచార్జ్‌ ప్లాన్‌ల కోసం చూస్తున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే..

ఎయిర్‌టెల్ వివిధ వర్గాల వినియోగదారుల అవసరాలను తీర్చే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల శ్రేణిని అందిస్తోంది. పెద్ద మొత్తంలో డేటా అవసరం లేకుండా తక్కువ ధరలో నెలవారీ రీఛార్జ్ కోసం చూస్తున్నవారికి, రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు లాంగ్ వాలిడిటీని అందించే ప్లాన్లు సుమారు రూ .200 వద్ద ఎయిర్‌టెల్‌లో ఉ‍న్నాయి. ఆ చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లు ఏవో ఇక్కడ పరిశీలిద్దాం.

రూ.211 ప్లాన్
ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 1 జీబీ లభిస్తుంది. అంటే 30 రోజులకు మొత్తం 30 జీబీ లభిస్తుందన్నమాట. అయితే ఇందులో కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే ఇది డేటా ఓన్లీ ప్లాన్.  బ్రౌజింగ్, సోషల్ మీడియా లేదా ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాల కోసం ప్రధానంగా మొబైల్ డేటాను ఉపయోగించేవారికి ఈ ప్లాన్‌ అనువైనది.

రూ .219 ప్లాన్
డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు రెండింటినీ కోరుకునే వినియోగదారులకు ఎయిర్‌టెల్ రూ .219 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి ఎంపిక. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీని అందిస్తుంది. నెల మొత్తం 3 జీబీ డేటాను అందిస్తుంది. నెలంతా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఆనందించవచ్చు.

ఎలా రీచార్జ్ చేసుకోవాలి?
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం రీఛార్జ్ చేసుకోవడం చాలా సులభం. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా నేరుగా మీ ఎయిర్‌టెల్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లోనూ, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి పాపులర్ థర్డ్ పార్టీ రీఛార్జ్ యాప్‌లలో కూడా ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)