Breaking News

ఎయిర్‌టెల్‌ డేటా సెంటర్‌ అరుదైన ఘనత

Published on Fri, 06/28/2024 - 09:07

ఎయిర్‌టెల్‌ డేటా సెంటర్‌ విభాగమైన నెక్స్‌స్ట్రా అరుదైన ఘనత సాధించింది.  కార్బన్ డిస్‌క్లోజర్ ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో క్లైమేట్ గ్రూప్ నేతృత్వంలోని ఫ్లాగ్‌షిప్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌లో చేరింది. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తు వినియాగానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 

నెక్స్‌స్ట్రా దేశవ్యాప్తంగా 12 పెద్ద, 120 ఎడ్జ్ డేటా సెంటర్లతో దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ల నెట్వర్క్‌ను కలిగి ఉంది. "మాది పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన బ్రాండ్. క్లీన్ ఎనర్జీ ప్రత్యామ్నాయాలను అవలంబిస్తున్నాం. 2031 నాటికి మా నెట్‌ జీరో లక్ష్యాలను సాధించే దిశగా మేము ఆరోగ్యకరమైన మార్గంలో ఉన్నాం. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తుకు నిబద్ధతతో ఆర్ఈ 100 చొరవలో భాగం కావడం సంతోషంగా ఉంది" అని ఎయిర్‌టెల్ నెక్స్‌స్ట్రా సీఈవో ఆశిష్ అరోరా ఒక ప్రకటనలో తెలిపారు.

భారత్‌లో ఆర్‌ఈ 100 ఇనిషియేటివ్‌కు హామీ ఇచ్చిన ఏకైక డేటా సెంటర్ సంస్థగా, ఈ మైలురాయిని చేరుకున్న 14 వ భారతీయ సంస్థగా నెక్స్‌స్ట్రా నిలిచింది. కంపెనీ తన పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచింది. ఇప్పటి వరకు 4,22,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి ఒప్పందాలను కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, క్యాప్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తిని సోర్సింగ్ చేయడం ద్వారా సుమారు 1,56,595 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినట్లు నెక్స్‌స్ట్రా పేర్కొంది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)