Breaking News

క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేత

Published on Tue, 05/06/2025 - 13:52

అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎయిరిండియా ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులను మే, 8 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో జరిగిన క్షిపణి దాడి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఏఐ 139ను ఇటీవల అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి కారణంగా ఇజ్రాయెల్‌-యెమెన్‌ ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.

క్షిపణి దాడి

యెమెన్‌కు చెందిన హౌతీలు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌ పరిధిలో దాడికి పాల్పడ్డారు. దాంతో విమానాశ్రయం సమీపంలో టెర్మినల్ 3 పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. మే 4న జరిగిన ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. బోయింగ్ 787కు చెందిన ఎయిరిండియా విమానం ఏఐ139 ల్యాండ్ అవ్వడానికి గంట ముందు ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్‌రాడార్‌24.కామ్‌ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం జోర్డాన్ గగనతలంలో ఉందని, దాడి సమాచారం తెలిసిన వెంటనే దాన్ని అబుదాబికి మళ్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: సాంకేతికతతో యుద్ధానికి సై

ఎయిరిండియా స్పందన

మే 4న జరిగిన ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఎయిరిండియా మొదట టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగిస్తున్న విమానాలను మే 6 వరకు నిలిపివేసింది. అక్కడ కొనసాగుతున్న భద్రతా కారణాల వల్ల  విమానాల నిలిపివేతను మే 8 వరకు పొడిగించింది. టెల్ అవీవ్‌కు ఎయిరిండియా వారానికి ఐదు విమానాలను నడుపుతోంది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో సంస్థ బృందాలు ప్రభావిత ప్రయాణీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)