Breaking News

బంపరాఫర్‌.. రూ. 1799కే ఫ్లైట్‌ జర్నీ!

Published on Fri, 02/02/2024 - 18:27

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బంపరాఫర్‌ ప్రకటించింది. వన్‌వే టికెట్‌ డొమెస్టిక్‌ రూట్లలో రూ. 1,799, అంతర్జాతీయ రూట్లలో రూ. 3,899 నుంచి ప్రారంభమయ్యే నెట్‌వర్క్-వైడ్ సేల్‌ను ప్రారంభించింది . 

ఎయిర్‌ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ పేరిట పరిమిత-కాల  నెట్‌వర్క్-వ్యాప్త ఆఫర్‌ను ఫిబ్రవరి 2న ప్రారంభించింది. ఇది ఫిబ్రవరి 5 వరకు చెల్లుబాటులో ఉంటుంది.  దీంతోపాటు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే బుకింగ్‌ చేస్తే ఈ ఆఫర్‌పై కన్వీనియన్స్ ఫీజు కూడా మినహాయించనున్నట్లు ఎయిర్‌ఇండియా ఒక విడుదలలో తెలిపింది.

షరతులు ఇవే..
ఎయిర్‌ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ కింద బుకింగ్‌లు కేవలం నలుగురికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.  ఫిబ్రవరి 2 నుంచి సెప్టెంబర్ 30 మధ్య చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.  ఫిబ్రవరి 5వ తేదీ లోపు బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దేశీయ మార్గాల్లో  అన్నీ కలుపుకొని వన్-వే ఎకానమీ క్లాస్‌ ఛార్జీలు రూ.1,799 నుంచి ప్రారంభమవుతాయి. అయితే వన్-వే బిజినెస్ క్లాస్‌లో ఇది రూ. 10,899. ఇక అంతర్జాతీయ మార్గాల్లో వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు  రూ. 3,899 నుంచి ప్రారంభమవుతాయి.

ఈ సేల్‌ అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉంటాయి. ముందుగా బుక్‌ చేసుకున్నవారికి సీట్లు లభిస్తాయని ఎయిర్‌ లైన్స్ తెలిపింది. ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్‌లపై కన్వీనియన్స్ ఫీజు ఆదా చేసుకోవచ్చు.

దేశంలోని పలు నగరాలతో పాటు యూఎస్‌, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ & మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణ ఆసియాలో ఎయిర్‌లైన్ నిర్వహించే గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)