Breaking News

విద్యార్థులకు ఎయిరిండియా టికెట్‌ ధరలో ఆఫర్‌

Published on Wed, 12/18/2024 - 19:24

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం దేశంలో ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు విమాన ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదనంగా 10 కిలోల వరకు బ్యాగేజ్‌ను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

అర్హతలు ఇవే..

దేశీయ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థుల వయసు 12 ఏళ్ల వరకు ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు 12-30 ఏళ్ల వయసు వరకు ఉండొచ్చు. అడ్మిషన్‌ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిందై ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక విద్యాసంవత్సరం ఫుల్ టైమ్ కోర్సులో చేరి ఉండాలి.

ఇదీ చదవండి: యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడిపై సెబీ కొరడా

ఎక్కడ బుక్‌ చేసుకోవాలి..?

ఈ ఆఫర్‌ వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఎయిర్‌పోర్ట్‌ టికెటింగ్ కార్యాలయాల ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌, ఎయిరిండియా బ్యాంకు పార్టనర్లు జారీ చేసిన క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అందనంగా ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకునే విద్యార్థులకు కన్వినియెన్స్‌ ఛార్జీల రూపంలో ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ నిపుణ్‌ అగర్వాల్‌ తెలిపారు. దానివల్ల దేశీయ విమానాల్లో ప్రయాణించే విద్యార్థులు రూ.399, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లేవారు రూ.999 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)