Breaking News

ఎయిరిండియాలో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్‌..

Published on Thu, 06/26/2025 - 07:26

న్యూఢిల్లీ: నష్టాలతో నడుస్తున్న విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో ప్రమోటర్‌ సంస్థలు టాటా సన్స్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. వీటిలో ఒక్క చివరి నెల(మార్చి)లోనే రూ. 4,306 కోట్లు అందించాయి. 2022 జనవరి మొదలు టాటా గ్రూప్‌ ఎయిరిండియాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో సరికొత్త మార్పులకు తెరతీసే(ట్రాన్స్‌ఫార్మేషన్‌) ప్రణాళికలను అమలు చేస్తోంది.

2024 నవంబర్‌లో రెండు సంస్థల భాగస్వామ్య కంపెనీ విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేశాయి. తద్వారా ఎయిరిండియాలో సింగపూర్‌ సంస్థ 25.1 శాతం వాటా దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా మూలధన వ్యయాలకుగాను ప్రమోటర్‌ సంస్థలు గతేడాది రూ. 9,500 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రయివేట్‌ రంగ విమానయాన దిగ్గజానికి టాటా సన్స్‌ రూ. 3,225 కోట్లు, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ. 6,333 కోట్లు చొప్పున అందించినట్లు వెల్లడించారు. నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు వర్కింగ్‌ క్యాపిటల్, వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా సమకూర్చినట్లు తెలియజేశారు.

బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ వివరాల ప్రకారం ఈ మార్చిలో టాటా సన్స్‌  రూ. 3,225 కోట్లు, సింగపూర్‌ సంస్థ రూ. 1,081 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. మార్చి పెట్టుబడులకు ముందు ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ దాదాపు రూ. 5,253 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. కాగా.. 2024 డిసెంబర్‌31తో ముగిసిన 9 నెలల కాలంలో ఎయిరిండియా గ్రూప్‌ అనుకోని పద్దులకు ముందు రూ. 8,033 కోట్ల నష్టాలు ప్రకటించింది. ఇదే కాలంలో ప్రొవిజనల్‌ గణాంకాల ప్రకారం రూ. 56,367 కోట్ల ఆదాయం సాధించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)