Breaking News

క్రాష్‌ తర్వాత ఎయిరిండియా కొత్త ఆశలు

Published on Tue, 11/25/2025 - 17:48

వచ్చే ఏడాది (2026) ఆఖరు నాటికి కొత్తగా 26 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ (Air India CEO Campbell Wilson) వెల్లడించారు. అలాగే అప్‌గ్రేడ్‌ చేసిన విమానాలతో 81 శాతం ఇంటర్నేషనల్‌ సర్వీసులను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అయితే, మొత్తం మీద విమాన ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వివరించారు.

‘ఏఐ 171 క్రాష్‌ కావచ్చు లేదా ఇతరత్రా పరిస్థితులు కావచ్చు గత కొద్ది నెలలుగా ఎదురైన ప్రతికూలతలు ఎలా ఉన్నా, 2026లో ఎయిరిండియాలో సుస్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మేము పెట్టుబడుల ప్రణాళికలను కొనసాగిస్తున్నాం‘ అని విల్సన్‌ చెప్పారు. ‘కొత్త విమానాలు వస్తున్నా, కొన్ని విమానాలను లీజుదార్లకు తిరిగి ఇచ్చేయనుండటం, చాలా మటుకు విమానాలకు రెట్రోఫిట్‌ చేస్తుండటం వల్ల వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్యాపరంగా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు.

ఎయిరిండియా గ్రూప్‌లో ప్రస్తుతం 300 విమానాలు (ఎయిరిండియాకి 187, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కి 110 విమానాలు) ఉన్నాయి. ఎయిరిండియా వద్ద సుదీర్ఘ దూరాలకు ప్రయాణించగలిగే బోయింగ్‌ 777 విమానాలు 22, అలాగే బోయింగ్‌ 787 రకం విమానాలు 32 ఉన్నాయి. వచ్చే ఏడాది ఎయిరిండియాకు 20 చిన్న విమానాలు, 6 పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ అందుబాటులోకి వస్తాయని విల్సన్‌ చెప్పారు. 2026 ఆఖరు నాటికి బోయింగ్‌ 787 విమానాల్లో మూడింట రెండొంతుల ఎయిర్‌క్రాఫ్ట్‌లు అప్‌గ్రేడ్‌ అవుతాయని వివరించారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)