60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..

Published on Thu, 10/31/2024 - 13:34

టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.

ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్‌ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్‌ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.

వైడ్‌ బాడీ విమానాలు లేవు..

‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్‌ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్‌ అధికారి చెప్పారు.

ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!

ఈ ప్రాంతాల నుంచి యూఎస్‌కు విమానాలు

ఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)