Breaking News

ఏఐతో బీమా రంగంలో పెను మార్పులు

Published on Fri, 08/04/2023 - 03:54

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కృత్రిమ మేథ (ఏఐ)తో బీమా రంగంలో పెను మార్పులు వస్తున్నాయని డిజిట్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌ (అనలిటిక్స్, డేటా సైన్స్‌ విభాగం) విశాల్‌ షా తెలిపారు.  విస్తృతమైన డేటాబేస్‌లను విశ్లేషించి వివిధ రిస్కులను మదింపు చేసేందుకు, సముచితమైన ప్రీమియంలను నిర్ణయించేందుకు బీమా సంస్థలు ప్రస్తుతం ఏఐ ఆధారిత అల్గోరిథమ్స్‌ను ఉపయోగిస్తున్నాయని వివరించారు. అలాగే మోసపూరిత క్లెయిమ్‌లను కూడా వీటితో గుర్తించగలుగుతున్నట్లు చెప్పారు.

మరోవైపు, కస్టమర్లకు సరీ్వసులను మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు, వర్చువల్‌ అసిస్టెంట్లు వినియోగంలోకి వచి్చనట్లు షా తెలిపారు. తక్షణం సమాధానాలిచ్చేలా, పాలసీల ఎంపికలు, కోట్‌ జనరేషన్‌ మొదలైన అంశాల్లో కస్టమర్లకు సహాయపడేలా వీటి శిక్షణ ఉంటోందన్నారు. అలాగే కీలకమైన క్లెయిమ్‌లకు సంబంధించి మదింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీమా సంస్థలు ప్రత్యేక అల్గోరిథమ్‌లను ఉపయోగిస్తున్నాయని చెప్పారు.

మోటర్‌ బీమా విషయానికొస్తే వాహనాలను వ్యక్తిగతంగా పరీక్షించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ఇమేజ్‌ రికగి్నషన్‌ టెక్నాలజీ ద్వారా నష్టాన్ని అంచనా వేయడంలోనూ ఏఐ సహాయపడుతోందని షా చెప్పారు. బీమా రంగంలో భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించడంలో తోడ్పడటం ద్వారా వినూత్న ఉత్పత్తులను రూపొందించేందుకు కూడా అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్, మెషిన్‌ లెరి్నంగ్‌ అల్గోరిథమ్‌లు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)