Breaking News

ముదురుతున్న ఏఐ వార్‌!

Published on Wed, 06/25/2025 - 14:48

గూగుల్‌, ఎక్స్‌, మెటా, ఓపెన్‌ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్‌ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక ప్రచారం ప్రారంభించినట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్‌పర్ట్‌లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.

నేరుగా సంప్రదింపులు

కొన్ని సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, డెవలపర్లు, స్టార్టప్ ఫౌండర్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంప్రదిస్తున్నారు. వీరిలో కొందరిని వ్యక్తిగతంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఆయా నిపుణులను నేరుగా సంప్రదిస్తున్నారు. వారితో జరుపుతున్న చర్చల్లో కేవలం నియామకాల గురించే కాకుండా ఆర్టిఫిషియన్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌, భవిష్యత్తు కార్యకలాపాలు వంటి చాలా అంశాలను చర్చిస్తున్నారు.

సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ కోసం..

మెటా కొన్ని రోజుల నుంచి మానవ స్థాయి కృత్రిమ మేధ వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌’ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు ప్రపంచంలోనే టాప్‌ స్కిల్డ్‌ పర్సన్స్‌ను నియమించుకోవాలని మెటా భావిస్తోంది. దాంతో సరైన నైపుణ్యాలు ఉన్నవారికి భారీగా ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. అలెగ్జాండర్ వాంగ్‌ స్థాపించిన స్కేల్ ఏఐ కంపెనీను 14 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వాల్యుయేషన్‌కు కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టార్టప్‌ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన వాంగ్ ఇప్పుడు కృత్రిమ మేధ ఆవిష్కరణలో మెటా తరఫున పని చేస్తున్నారు.

ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశం

కొందరు విముఖత

అయితే కొందరు మాత్రం తమ నైపుణ్యాలకు, తాము స్థాపించిన కంపెనీలకు మెటా ఎంత వెచ్చిస్తానంటున్నా కలిసిరావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. జుకర్‌బర్గ్, మెటా ఏఐ చీఫ్‌ సైంటిస్ట్‌ యాన్ లెకున్ మధ్య ఫిలాసఫికల్‌ విభేదాల వల్ల ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ దీర్ఘకాలికంగా ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)