Breaking News

మానవ మేధస్సు ముందు ఏఐ ఎంత?

Published on Tue, 08/26/2025 - 19:57

ఏఐ సాధనాలు మరింత అధునాతనంగా మారినప్పటికీ, కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే మానవ మేధస్సును ఏదీ భర్తీ చేయలేదని నిపుణులు భావిస్తున్నారు. అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో భారతదేశంలో 83% మంది నిపుణులు, హైదరాబాద్‌లోని 88% మంది నిపుణులు ఏఐపై ఆధారపడడం కంటే మానవ మేధస్సుకు ఓటేస్తున్నారు.

లింక్డ్‌ఇన్‌ అధ్యయనంలోని అంశాలు..

  • హైదరాబాద్‌లో 79% మంది ఉద్యోగ విధుల్లో భాగంగా ఏఐని వాడుతున్నట్లు చెబుతున్న సమయంలో కీలక నిర్ణయాల విషయంలో మాత్రం ఏఐ సాయం తీసుకోకపోవడం గమనార్హం.

  • 75% మంది తమ కెరియర్‌లో ఎదిగేందుకు ఏఐలో ప్రావీణ్యం సంపాదించడం అవసరమని భావిస్తున్నారు.

  • ఏఐలో నైపుణ్యం సాధించడం రెండో ఉద్యోగంలా అనిపిస్తుందని హైదరాబాద్‌లోని నలుగురు నిపుణుల్లో ముగ్గురు అంగీకరిస్తున్నారు.

  • 59% మంది ఏఐని పూర్తి సామర్థ్యంతో ఉపయోగించడం లేదని చెబుతున్నారు.

  • 75% మంది నిపుణులు ఏఐ తమ రోజువారీ పని జీవితాన్ని మెరుగుపరుచగలదని నమ్ముతున్నారు.

  • 78% మంది నిపుణులు ఏఐని నిజమైన నిర్ణయం తీసుకోవడానికి కాకుండా రాయడం, డ్రాఫ్టింగ్‌కు ఉపయోగకరంగా భావిస్తున్నారు.

  • 70% మంది ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏఐ కంటే కూడా తమ సొంత నిర్ణయాలనే నమ్ముతున్నారు.

  • భారతదేశంలో 83% మంది కార్యనిర్వాహకులు మంచి వ్యాపార నిర్ణయాలు మానవ మేధస్సుపైనే ఆధారపడి ఉంటాయని నమ్ముతున్నారు.

లింక్డ్ఇన్ కెరియర్‌ నిపుణులు, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరజిత బెనర్జీ మాట్లాడుతూ ‘ఏఐ ఒ​​క అద్భుతమైన సాధనం. ఇది వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతోంది. రోజువారీ పనులను క్రమబద్ధీకరించగలదు. అయితే కీలక విషయాల్లో నిర్ణయం తీసుకునేప్పుడు చాలామంది ఏఐపై ఆధారపడడం లేదు. ఏఐని తాము  విశ్వసించే సాధనంగానే కానీ, అనుసరించే సాధనంగా భావించడంలేదు. మానవులు మాత్రమే చేసే పని కోసం సమయాన్ని ఆదా చేసేందుకు ఏఐని ఉపయోగించాలి’ అని చెప్పారు.

ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)