Breaking News

భారత్‌లో తలుపులు మూసిన ‘ఓపెన్‌డోర్’

Published on Thu, 06/11/2026 - 13:36

సాంకేతిక రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు, ఏఐ విస్తరణ, భారతీయ ఐటీ, సర్వీస్ రంగ ఉద్యోగులపై భారీ ప్రభావమే చూపుతున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం ‘ఓపెన్‌డోర్’ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 250 మంది భారతీయ ఉద్యోగులు ఒకేసారి రోడ్డున పడినట్లయింది.

కంపెనీ వ్యూహాత్మక మార్పులపై ఓపెన్‌డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్‌లో కొన్ని అంశాలు అధికారికంగా ధ్రువీకరించారు. ఆ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో చర్చనీయాంశమైంది. ‘మా కస్టమర్లు అందరూ అమెరికాలోనే ఉన్నారు. కాబట్టి వారికి సేవలందించే ఆపరేషనల్ విభాగాలు కూడా ఆ కస్టమర్లకు వీలైనంత దగ్గరగా ఉండటమే వ్యాపారపరంగా ఉత్తమం’ అని చెప్పారు. గతంలో వివిధ వ్యవస్థల్లో మ్యాన్యువల్ వర్క్‌ఫ్లోలను నిర్వహించడానికి భారతదేశంలో ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుత సాంకేతిక పురోగతి వల్ల ఆ అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు.

శ్రామిక శక్తిపై ఏఐ దెబ్బ!

ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం కంపెనీ శరవేగంగా అవలంబిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతగా తెలుస్తోంది. గతంలో భారత్‌లోని సిబ్బంది మ్యాన్యువల్‌గా చేసే పనులను ఇప్పుడు అమెరికాలో ఏఐ ఎనేబుల్డ్ బృందాల సాయంతో మరింత సులభంగా పూర్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సాంకేతికత పెరగడం వల్ల విదేశాల్లో (భారత్‌లో) ప్రత్యేకంగా ఒక టీమ్‌ను ఉంచాల్సిన అవసరం తగ్గిందని మేనేజ్‌మెంట్ పేర్కొంది.

ప్రతిభకు లోటు లేదు.. కానీ తప్పట్లేదు!

ఈ తొలగింపులు భారతీయ బృందం పనితీరు లోపం వల్ల జరిగినవి కావని సీఈఓ నెజాటియన్ నొక్కి చెప్పారు. భారత్‌లోని ఉద్యోగులు ఎంతో ప్రతిభావంతులని, ఇతర సంస్థలకు వారు అద్భుతమైన ఆస్తిగా మారుతారని ప్రశంసించారు. అయితే, వ్యాపార సరళీకరణ, ఏకీకృత ప్లాట్‌ఫారమ్ నిర్మాణం, మ్యాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు!

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)