Breaking News

భారత్‌లో ఉద్యోగాలకు ఏఐ ముప్పు తక్కువే

Published on Fri, 12/26/2025 - 05:20

న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కృత్రిమ మేధతో (ఏఐ) భారత్‌లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు ముప్పు తక్కువేనని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ చెప్పారు. మొత్తం ఉద్యోగుల్లో వైట్‌ కాలర్‌ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫీసు ఉద్యోగాలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌ (స్టెమ్‌) ఆధారిత విభాగాల్లోనే ఉంటున్నాయని తెలిపారు. ఉద్యోగులను పూర్తిగా తప్పించేసి, వారి స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి తలెత్తడం కన్నా, సిబ్బంది ఉత్పాదకత పెంపునకు ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు.

 ఏఐ కొన్ని సందర్భాల్లో డేటాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి, తప్పుగా ఇస్తున్న వివరాలను  సరిచేసేందుకు ఇప్పటికీ మానవ ప్రమేయం అవసరం ఉంటోందని ఆయన చెప్పారు. ఏఐతో నిర్దిష్ట రంగాలు, అవసరాలకు తగ్గ సొల్యూషన్స్‌ని రూపొందించేందుకు అత్యుత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులు కావాల్సి ఉంటుందని కృష్ణన్‌ చెప్పారు. ఇలాంటి ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవచ్చని వివరించారు. దేశీయంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతి సాధన కోసం కృత్రిమ మేధని ఉపయోగించుకోవడంతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూర్చగలిగే పటిష్టమైన స్థితిలో భారత్‌ ఉందని  చెప్పారు.   
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు