Breaking News

భారత్‌కు ‘తయారీ’ స్వర్ణయుగం

Published on Fri, 12/27/2024 - 06:35

న్యూఢిల్లీ: తయారీ రంగానికి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉందని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ గురువారం అన్నారు. ప్రపంచ సరఫరాల చైన్‌  భారతదేశానికి అనుకూలంగా మారుతుండడం ఇక్కడ సానుకూల అంశమని పే ర్కొన్నారు.   ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపారాలు సవాళ్లను తట్టుకుంటూ, స్థిరీకరణ సాధిస్తున్నాయని తద్వారా ఈ రెండింట మధ్య (సవాళ్లు–స్థిరీకరణ) కొత్త సమతౌల్యతను సంస్థలు సాధిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రూప్‌ కంపెనీల సిబ్బందికి చంద్రశేఖరన్‌ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాన్ని పంపారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 

→ భారతదేశం ఇప్పుడు  తయారీ స్వర్ణయుగంలో ఉంది. 2024 తర్వాత 2025కోసం ఆశావాదంతో ఎదురు చూస్తున్నాను. టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎమెరిటస్‌ రతన్‌ టాటాను కోల్పోవడంతో ఈ సంవత్సరం గ్రూప్‌కు ఒక విచారకరమైన ఏడాదిగా నిలిచింది.  

→ ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ నేతృత్వంలోని కీలక చొరవలు జరుగుతాయని, ఇవి మొత్తం మానవాళికి సహాయపడతాయని భావిస్తున్నాం.  

→ తయారీకి భారతదేశంలో మన ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉంది. 

→ మహమ్మారి స్వల్పకాలిక నష్టాన్ని కలిగించినా ఆన్‌లైన్, ఏఐ వినియోగం వ్యవస్థలో శాశ్వత ప్రయోజనాలను అందించే స్థాయికి ఎగశాయి.  

→ టాటా గ్రూప్‌ 5 లక్షల తయారీ ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికలతో ముందుకు వెళుతోంది.  

→ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ పరికరాలు, హార్డ్‌వేర్‌ ప్రాజెక్టుల్లో దేశం నేటి పెట్టుడులు  రేపటి ఆర్థిక వ్యవస్థలో మున్ముందు  ప్రధాన పాత్ర పోషించనున్నాయి.  

→ గుజరాత్‌ ధొలేరాలో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్‌ ఫ్యాబ్, అస్సాంలోని సరికొత్త సెమీకండక్టర్‌– ఓఎస్‌ఏటీప్లాంట్‌ సహా ఏడు కొత్త ఉత్పాదక కర్మాగారాలకు భూమిపూజలు, నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటకలోని నరసపురలో ఎలక్ట్రానిక్స్‌ అసెంబ్లీ ప్లాంట్, తమిళనాడులోని పనపాక్కంలో ఆటోమోటివ్‌ ప్లాంట్, కర్ణాటకలోని బెంగళూరులో కొత్త ఎంఆర్‌ఓ చొరవలను కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. మనం గుజరాత్‌లోని సనంద్‌లో అలాగే బ్రిటన్‌లోని సోమర్‌సెట్‌లో కొత్త బ్యాటరీ సెల్‌ తయారీ కర్మాగారాలను కూడా కలిగి ఉన్నాము. అలాగే గుజరాత్‌లోని వడోదరలో సీ295 ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ (ఎఫ్‌ఏఎల్‌)ను ప్రారంభించాము. తమిళనాడులోని తిరునెల్వేలిలో సోలార్‌ మాడ్యూల్‌ ఉత్పత్తిని ప్రారంభించాము.  కొత్తగా ఐదు లక్షల కొత్త ఉద్యోగాలతో పాటు,  రిటైల్, టెక్‌ సరీ్వసెస్, ఎయిర్‌లైన్స్,  హాస్పిటాలిటీ, ఇతర రంగాలలో అనేక సేవల ఉద్యోగాలను అదనంగా గ్రూప్‌ కల్పించనుంది.  

→ ఇటువంటి వృద్ధి చొరవలు గ్రూప్‌నకు అలాగే  భారతదేశానికి ఉత్తేజకరమైనవి. ప్రతి నెలా గ్రూప్‌ వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే 10 లక్షల మంది యువకులకు ఈ చొరవలు ఆశావాదన్ని కల్పిస్తాయి. 

→ సెమీకండక్టర్‌ తయారీ వంటి రంగాల నుండి పరోక్ష ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.  

→ ఉక్రెయిన్, గాజా, సూడాన్‌లలో సైనిక ఘర్షణలు చూస్తున్నాం.  యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో మానవతా సంక్షోభాలు తీవ్రం అయ్యాయి. బంగ్లాదేశ్, దక్షిణ కొరియాలో పౌరుల నేతృత్వంలోని ఉద్యమాలను కూడా చూశాము. ఆయా అంశాలు దేశీయ, విదేశీ విధాన కల్పనలపై తీవ్ర ప్రభావితం చూపుతాయి. ప్రత్యేకించి ఇమ్మిగ్రేషన్, సాంకేతికత ఇక్కడ ప్రస్తావనాంశాలు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి టారిఫ్‌లు మరోసారి నాయకుల మనస్సుల్లో ఉన్నాయి. వీటిపై అనిశ్చితి వాతావరణం ఉంటుంది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, గ్రూప్‌ పురోగతి స్థిరంగా కొనసాగింది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)