Breaking News

IMF Report: ఆ టెక్నాలజీతో సగానికిపైగా ఉద్యోగాలు పోతాయ్‌.. 

Published on Mon, 01/15/2024 - 11:37

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వ్యవస్థల్లోని ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. దీని ప్రభావం ఇప్పటికే ప్రారంభం కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పును కలిగిస్తుందని, అయితే ఉత్పాదకత స్థాయిలను పెంచడానికి, ప్రపంచ వృద్ధికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ చెబుతున్నారు.

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 60 శాతం ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా..  దావోస్‌ డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు బయలుదేరే కొద్దిసేపటి ముందు వాషింగ్టన్‌లో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందన్న అంచనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ తాజా నివేదికను ఉటంకిస్తూ పేర్కొన్నారు.

సగం మంది పోయినా మిగిలినవారికి లబ్ధి
ఎంత ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందన్నారు. ఏఐ వల్ల ఉద్యోగం పూర్తిగా పోవచ్చు లేదా మెరుగుపడవచ్చని, ఉత్పాదకత, ఆదాయ స్థాయి పెరగవచ్చని జార్జివా చెప్పారు. కాగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల సగం ఉద్యోగాలు పోయినప్పటికీ మిగిలిన సగం మంది ఏఐ కారణంగా మెరుగైన ఉత్పాదకత ప్రయోజనం పొందుతారని ఐఎంఎఫ్‌ తాజా నివేదిక పేర్కొంది.

ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్మిక వ్యవస్థపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పెద్దగా ఉండదని, అదే సమయంలో దాని ద్వారా ఉత్పన్నమయ్యే మెరుగైన ఉత్పాదకత నుంచి ప్రయోజనం పొందే అవకాశం కూడా తక్కువగానే ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించే అవకాశాలను అందుకోవడానికి పేద దేశాలకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాల్సిఉందని జార్జివా ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు